ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Nitish on Specail Status: ప్రత్యేక హోదా అడిగాం కానీ.. నితీష్ రియాక్షన్

ABN, Publish Date - Jul 23 , 2024 | 05:34 PM

బీహార్‌ కు ప్రత్యేక హోదాపై కేంద్ర బడ్జెట్‌ లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఎలాంటి ప్రతిపాదన చేయకపోవడంపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీష్ కుమార్ స్పందించారు. ప్రత్యేక హోదా కానీ, స్పెషల్ ప్యాకేజీ కానీ ఇవ్వాలని ఎన్డీయే నేతలకు తాను చెప్పానని, ఆ క్రమంలోనే బీహార్‌ అభివృద్ధికి పలు కీలక కేటాయింపులు ప్రకటించారని చెప్పారు.

పాట్నా: బీహార్‌ (Bihar)కు ప్రత్యేక హోదాపై (Special Status) కేంద్ర బడ్జెట్‌ (Union Budget 2024)లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఎలాంటి ప్రతిపాదన చేయకపోవడంపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీష్ కుమార్ (Nitish Kumar) స్పందించారు. ప్రత్యేక హోదా కానీ, స్పెషల్ ప్యాకేజీ కానీ ఇవ్వాలని ఎన్డీయే నేతలకు తాను చెప్పానని, ఆ క్రమంలోనే బీహార్‌ అభివృద్ధికి పలు కీలక కేటాయింపులు ప్రకటించారని చెప్పారు.


''ప్రత్యేక హోదా గురించి బీజేపీతో సహా ఎన్డీయే నేతలకు పదేపదే కోరుతూనే వచ్చా. ప్రత్యేక హోదా కానీ ప్రత్యేక ప్యాకేజీ కానీ ఇవ్వాలని కోరాను. దానికి కొనసాగింపు గానే రాష్ట్రానికి బడ్జెట్‌లో పలు కీలక కేటాయింపులు ప్రకటించారు. ప్రత్యేక హోదా గురించి చాలా మందితో మాట్లాడటం జరిగింది. అయితే చాలాకాలం క్రితమే ప్రత్యేక హోదా అంశాన్ని దూరంగా పెట్టేశారని వారు చెప్పారు. హోదాకు బదులుగా బీహార్‌ అభివృద్ధికి సాయం ప్రకటించాల్సి ఉంటుంది. ఇప్పుడే అది మొదలైంది'' అని మీడియాతో మాట్లాడుతూ నితీష్ చెప్పారు.

Budget 2024: బిహార్‌కు ప్రత్యేక హోదా లేదు కానీ..


కాగా, బీహార్‌కు ప్రకటించిన పథకాల అమలు తర్వాత బీహార్‌లో అభివృద్ధి రేటు గణనీయంగా పెరుగుతుందని జేడీయూ ఎంపీ, కేంద్ర మంత్రి రాజీవ్ రంజన్ తెలిపారు. రాష్ట్రంలో మౌలిక వసతుల కల్పన, నీటిపారుదల, పర్యాటక రంగం సహా పలు రంగంలో అభివృద్ధి చోటుచేసుకుంటుందన్నారు.


నిర్మలా సీతారామన్ మంగళవారంనాడు లోక్‌సభకు సమర్పించిన బడ్జెట్‌లో బీహార్‌ అభివృద్ధికి పలు చర్యలు ప్రకటించారు. వారణాసిలోని విశ్వనాథుని ఆలయం తరహాలో బిహార్‌లోని బుద్ద గయాలో ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. బుద్ద గయాలో ఏర్పాటు చేసే ఆలయం వారణాసిలోని ఆలయాన్ని ప్రతిబింబించే విధంగా ఉంటుందని వివరించారు. రాజ్‌గిర్‌లోని జైన్ దేవాలయానికి సైతం ప్రత్యేక నిధులు కేటాయిస్తామన్నారు. బిహార్‌ను ప్రపంచ పర్యాటక కేంద్రంగా మార్చేందుకు చర్యలు తీసుకుంటామన్నారు.

Read Latest Telangana News and National News

Updated Date - Jul 23 , 2024 | 05:37 PM

Advertising
Advertising
<