Sushilkumar Shinde: అప్పట్లో కశ్మీర్ పర్యటన భయమేసింది... కేంద్ర మాజీ హోం మంత్రి షిండే వెల్లడి
ABN, Publish Date - Sep 10 , 2024 | 03:48 PM
ఐదు దశాబ్దాల తన రాజకీయ జీవితంపై 'ఫైవ్ డికేడ్స్ ఇన్ పాలిటిక్స్' అనే పుస్కకాన్ని షిండే మంగళవారంనాడు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా 2012లో కశ్మీర్ లోయలో తన పర్యటన అనుభవాన్ని ఆయన గుర్తు చేసుకున్నారు.
న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల వేళ యూపీఏ హయాంలో కేంద్ర హోం మంత్రిగా పనిచేసిన సుశీల్ కుమార్ షిండే (Sushil kumar Shinde) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అప్పట్లో జమ్ముకశ్మీర్‌లోని లాల్‌చౌక్‌ను సందర్శించేందుకు వెళ్లినప్పుడు తాను చాలా భయపడినట్టు చెప్పారు. ఆయన వ్యాఖ్యలపై బీజేపీ వెంటనే స్పందించింది. యూపీఏ హయాంలో పరిస్థితి అదయితే, ఇప్పటి తమ హయాంలో రాహుల్ గాంధీ విజయవంతంగా జమ్మూకశ్మీర్‌లో భారత్ జోడో యాత్ర సాగించారని వ్యాఖ్యానించింది.
దు దశాబ్దాల తన రాజకీయ జీవితంపై 'ఫైవ్ డికేడ్స్ ఇన్ పాలిటిక్స్' అనే పుస్కకాన్ని షిండే మంగళవారంనాడు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా 2012లో కశ్మీర్ లోయలో తన పర్యటన అనుభవాన్ని ఆయన గుర్తు చేసుకున్నారు. ''నేను హోం మంత్రి కావడానికి ముందు విద్యావేత్త విజయ్ ధర్‌ను కలుసుకున్నాను. ఆయన సలహా అడిగాను. ఎక్కడపడితే అక్కడ తిరగవద్దని ఆయన సలహా ఇచ్చారు. లాల్ చౌక్ (శ్రీనగర్) వెళ్లి అక్కడ ప్రజలను కలుసుకోమని, దాల్ లేక్ చుట్టూ తిరగమని ఆయన చెప్పారు. ఆయన సలహా నాకు పబ్లిసిటీ ఇచ్చింది. హోం మంత్రి ఎలాంటి భయం లేకుండా తిరుగుతున్నారని ప్రజలు అనుకున్నారు. అయితే నేను భయపడినట్టు ఎవరికి చెప్పగలను?'' అని షిండే వ్యాఖ్యానించారు. అందర్నీ నవ్వించేందుకు ఈ విషయం చెప్పానని, వాస్తవానికి ఒక మాజీ పోలీసుగా ఇలా మాట్లాడకూడదని చమత్కరించారు.
Sashi Tharoor: మోదీ శివలింగంపై తేలు.. శశిథరూర్ వ్యాఖ్యలపై సుప్రీంకోర్టు స్టే
మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ 2012లో షిండేను హోం మంత్రిగా నియమించారు. షిండే అప్పట్లో జమ్మూకశ్మీర్ పర్యటించినప్పుడు శ్రీనగర్‌లోని లాల్ చౌక్ వద్ద షాపింగ్ చేశారు. కశ్మీర్ ఆర్ట్ షోరూం సందర్శించారు. షిండే వెంట అప్పటి జమ్మూకశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ఉన్నారు. తన పర్యటనలో భాగంగా శ్రీనగర్‌లోని క్లాక్ టవర్‌ను సైతం ఆయన సందర్శించారు. ఈ 'ఘంటా ఘర్'ను 1978లో మాజీ సీఎం షేక్ అబ్దుల్లా కోరిక మేరకు నిర్మించారు. 2008-2010 మధ్య కశ్మీర్ లోయలో నిరసనలు పెల్లుబికినప్పుడు టవర్ పైన పాకిస్థాన్ జెండా ఎగురుతూ కనిపించిన సందర్భాలున్నాయి. కేంద్ర మంత్రిగా షిండే హయాంలోనే 26/11 ముంబై దాడుల సూత్రధారి అజ్మల్ కసబ్, పార్లమెంటుపై దాడి ఘటనలో అఫ్జల్ గురు విచారణ, ఉరి అమలు జరిగింది.
Read More National News and Latest Telugu News Click Here
Rahul Gandhi: యూఎస్ పర్యటనలో మళ్లీ కీలక వ్యాఖ్యలు
Updated Date - Sep 10 , 2024 | 03:59 PM