Delhi : ఖేద్కర్.. 12 సార్లు సివిల్స్
ABN, Publish Date - Jul 20 , 2024 | 03:39 AM
వివాదాస్పద ట్రైనీ ఐఏఎస్ పూజా ఖేద్కర్‌పై యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎ్‌ససీ) కఠిన చర్యలకు ఉపక్రమించింది. నకిలీ ధ్రువీకరణ పత్రాలు సమర్పించిన ఆమె నిబంధనలకు విరుద్ధంగా 12 సార్లు సివిల్ సర్వీసెస్ పరీక్షలకు
నకిలీ పత్రాలతో హాజరైనట్టు గుర్తింపు
కేసు నమోదు చేసిన యూపీఎస్‌సీ
ఐఏఎస్ ట్రైనీగా ఆమె అభ్యర్థిత్వం రద్దు?
నకిలీ పత్రాలతో హాజరైనట్టు గుర్తింపు
యూపీఎ్‌ససీ కేసు నమోదు .. ఆమె అభ్యర్థిత్వం రద్దుకు చర్యలు
న్యూఢిల్లీ, పుణె, జూలై 19: వివాదాస్పద ట్రైనీ ఐఏఎస్ పూజా ఖేద్కర్‌పై యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎ్‌ససీ) కఠిన చర్యలకు ఉపక్రమించింది. నకిలీ ధ్రువీకరణ పత్రాలు సమర్పించిన ఆమె నిబంధనలకు విరుద్ధంగా 12 సార్లు సివిల్ సర్వీసెస్ పరీక్షలకు హాజరైనట్టు గుర్తించింది. దీంతో ఆమెపై కేసు నమోదు చేసినట్టు శుక్రవారం తెలిపింది.
అంతేకాకుండా సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్-2022 నుంచి ఆమె అభ్యర్థిత్వాన్ని రద్దుతోపాటు భవిష్యత్తులో మళ్లీ నియామక పరీక్షలు రాయకుండా బహిష్కరించే దిశగా చర్యలు చేపడుతూ షోకాజ్ నోటీసులు జారీచేసింది. ఆ షోకాజ్ నోటీసులకు సమాధానం ఇవ్వడానికి రెండు వారాలు గడువు ఇచ్చింది. ఆమె తన పేరు, తల్లిదండ్రుల పేర్లు, ఫొటో, సంతకం, ఈ మెయిల్ ఐడీ, మొబైల్ నంబర్, చిరునామాకు సంబంధించిన పత్రాలన్నీ మార్చడం ద్వారా మోసానికి పాల్పడినట్టు తమ దర్యాప్తులో వెల్లడైందని దీంతో..
పూజా ఖేద్కర్‌పై సమగ్ర దర్యాప్తు చేపట్టినట్టు తెలిపింది. పూజ 2012 నుంచి ఇప్పటి వరకూ 12 సార్లు సివిల్ సర్వీసెస్ పరీక్షకు హాజరైనట్టు గుర్తించడంతో ఆమెకు షోకాజ్ నోటీసులు జారీచేసినట్టు ఇద్దరు సీనియర్ అధికారులు తెలిపారు. వాస్తవానికి సివిల్ సర్వీసెస్ పరీక్ష రాసేందుకు జనరల్ కేటగిరీ అభ్యర్థులకు 32 ఏళ్ల వరకు ఆరుసార్లు మాత్రమే అవకాశం కల్పిస్తారు. ఓబీసీ అభ్యర్థులకు 35 ఏళ్లు, ఓబీసీ దివ్యాంగ అభ్యర్థులకు 42 ఏళ్లు వచ్చేవరకు 9 సార్లు అవకాశం ఉంటుంది. కానీ, ఆమె నకిలీ పత్రాలతో యూసీఎ్‌ససీని మోసంచేసి 12 సార్లు పరీక్ష రాశారని అధికారులు పేర్కొన్నారు. కాగా, పూజా ఖేద్కర్‌పై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో మహారాష్ట్ర ప్రభుత్వం తన నివేదికను శుక్రవారం యూపీఎ్‌ససీకి సమర్పించింది.
ఆ కాపీని కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఏకసభ్య కమిటీకి కూడా పంపించింది. కాగా.. పూజా ఖేద్కర్ కేసుకు సంబంధించిన అంశాలు యూపీఎ్‌ససీ నియామక ప్రక్రియ సమగ్రతపై సందేహాలు కలిగేలా చేస్తున్నాయని కాంగ్రెస్ పార్టీ అభిప్రాయపడింది. పూజా ఖేద్కర్‌పై యూపీఎ్‌ససీ కేసు నమోదు చేయడంతో ఆమె శుక్రవారమే వాషిమ్ జిల్లాను వదిలి వెళ్లిపోయారు. అంతకుముందు స్థానిక ప్రభుత్వ గెస్ట్ హౌస్ వద్ద ఆమె విలేకరులతో మాట్లాడుతూ.. చట్టం తన పని చేసుకుపోతుందని అన్నారు.
తాను త్వరలోనే తిరిగొస్తానని చెబుతూ కారు ఎక్కి నాగపూర్ బయల్దేరి వెళ్లారు. 2023 బ్యాచ్ మహారాష్ట్ర కేడర్ ఐఏఎ్‌సగా ఎంపికైన పూజ ఈ నెల మొదటి వారంలో పుణె నుంచి వాషిమ్‌కు అసిస్టెంట్ కలెక్టర్‌గా బదిలీపై వచ్చిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా, పూజా ఖేద్కర్ తల్లికి సంబంధించిన ఇంజనీరింగ్ సంస్థను పింప్రి-చించ్‌వాడ నగరపాలక సంస్థ శుక్రవారం సీజ్ చేసింది. దాదాపు రూ.2లక్షలకు పైగా ఆస్తిపన్ను బకాయిలు ఉండడంతో ఈ మేరకు చర్యలు తీసుకున్నట్టు అధికారులు తెలిపారు. పూజా తల్లి మనోరమ ప్రస్తుతం పుణె పోలీసుల అదుపులో ఉన్నారు.
Updated Date - Jul 20 , 2024 | 03:59 AM