ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Kolkata: రాజ్‌భవన్‌లో నాకు భద్రత లేదు.. బెంగాల్ గవర్నర్ సంచలన వ్యాఖ్యలు

ABN, Publish Date - Jun 20 , 2024 | 01:22 PM

రాజ్‌భవన్‌లో తనకు భద్రత లేదని పశ్చిమ బెంగాల్ గవర్నర్ సీవీ ఆనంద్ బోస్(CV Anand Bose) సంచలన వ్యాఖ్యలు చేశారు. తన కార్యాలయంలో పూర్తిగా బెంగాల్(West Bengal) పోలీసులే మోహరించి ఉన్నారని పేర్కొన్నారు.

కోల్‌కతా: రాజ్‌భవన్‌లో తనకు భద్రత లేదని పశ్చిమ బెంగాల్ గవర్నర్ సీవీ ఆనంద్ బోస్(CV Anand Bose) సంచలన వ్యాఖ్యలు చేశారు. తన కార్యాలయంలో పూర్తిగా బెంగాల్(West Bengal) పోలీసులే మోహరించి ఉన్నారని పేర్కొన్నారు.

రాజ్ భవన్ ప్రాంగణాన్ని ఖాళీ చేయాలని పోలీసు సిబ్బందిని ఆదేశించిన కొద్ది రోజుల తర్వాత ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే పోలీసు సిబ్బందిని ఆదేశించినా వారు ఇప్పటికీ రాజ్ భవన్‌లోనే విధులు నిర్వహిస్తున్నారు.


"ప్రస్తుత ఇన్‌ఛార్జ్ అధికారి, ఆయన బృందం ఉండటంతో నా వ్యక్తిగత భద్రతకు ముప్పు పొంచి ఉంది. ఈ విషయాన్ని సీఎం మమతా బెనర్జీకి చెప్పాను. అయినా ఆమె నుంచి ఎలాంటి స్పందనా రాలేదు" అని బోస్ ఆవేదన వ్యక్తం చేశారు.

రాజ్‌భవన్‌లో ఉన్న పోలీసు సిబ్బంది నిరంతరం తనను స్నూపింగ్ చేస్తున్నారని బోస్.. రాష్ట్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. కొందరి ప్రభావంతో పోలీసు సిబ్బంది పని చేస్తున్నారని అన్నారు. వారిని తొలగించి కొత్త వారిని నియమించాలని కోరారు.

For Latest News and National News click here

Updated Date - Jun 20 , 2024 | 01:22 PM

Advertising
Advertising