IMD: బంగాళాఖాతంలో అల్పపీడనం.. మూడు రోజులు వర్ష సూచన
ABN, Publish Date - Nov 14 , 2024 | 11:09 AM
ఉత్తర తమిళనాడుకు సమీపంలో బంగాళాఖాతంలో అల్పపీడనం కేంద్రీకృతమై ఉన్న కారణంగా ఈ నెల 16వ తేదీ వరకు వర్షాలు కురవొచ్చని వాతావరణ శాఖ తెలిపింది. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ద్రోణి ప్రభావంతో గత రెండు రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. అలాగే, అదే ప్రాంతంలో మరో అల్పపీడనం ఏర్పడింది.
- వాతావరణ శాఖ వెల్లడి
చెన్నై: ఉత్తర తమిళనాడుకు సమీపంలో బంగాళాఖాతంలో అల్పపీడనం కేంద్రీకృతమై ఉన్న కారణంగా ఈ నెల 16వ తేదీ వరకు వర్షాలు కురవొచ్చని వాతావరణ శాఖ తెలిపింది. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ద్రోణి ప్రభావంతో గత రెండు రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. అలాగే, అదే ప్రాంతంలో మరో అల్పపీడనం ఏర్పడింది. దీని ప్రభావంతో ఈ నెల 16 వరకు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. రాష్ట్రంలో ఈశాన్య రుతుపవనాలు ప్రారంభమైనప్పటి నుంచి విస్తారంగా వర్షాలు కురుస్తున్న విషయం తెల్సిందే. చెన్నై, పరిసర ప్రాంతంలో రాత్రిపూట వర్షాలు కురుస్తున్నాయి.
ఈ వార్తను కూడా చదవండి: వామ్మో.. మరింత విషమంగా ఢిల్లీ వాయు కాలుష్యం.. ఏ స్థాయికి చేరిందంటే..
ఇపుడు బంగాళాఖాతంలో ఏర్పడే ఉపరితల ఆవర్తన ద్రోణి, అల్పపీడన ప్రభావంతో పాటు గత రెండు మూడు రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. బుధవారం మాత్రం మైలాడుదురై, కారైక్కాల్ ప్రాంతాల్లో భారీ వర్షం కురవడంతో విద్యా సంస్థలకు సెలవు ఇచ్చారు. అలాగే, కడలూరు, అరియలూరు, పెరంబలూరు జిల్లాల్లో మాత్రం కేవలం పాఠశాలలకు మాత్రమే సెలవు ప్రకటించారు. చెన్నై(Chennai) నగరంలో కూడా తేలికపాటి వర్షం కురిసింది. అలాగే, కోయంబత్తూరు, ఈరోడ్(Coimbatore, Erode) వంటి పశ్చిమ జిల్లాలతో పాటు డెల్టా జిల్లాలు, తిరునెల్వేలి, తూత్తుకుడి జిల్లాల్లో కూడా మోస్తరు నుంచి భారీ వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.
నేడు 27 జిల్లాలకు వర్ష సూచన
ఈ అల్పపీడనం కారణంగా గురువారం చెన్నై, తిరువళ్లూరు, కాంచీపురం, చెంగల్పట్టు, రాణిపేట, తిరువణ్ణామలై, కల్లకుర్చి, విల్లుపురం, కడలూరు, తంజావూరు, తిరువారూర్, నాగపట్టణం, మైలాడుదురై, పుదుక్కోట, శివగంగై, రామనాథపురం, నీలగిరి, కోయంబత్తూరు, తిరుపూరు, దిండిగల్, మదురై, విరుదునగర్, తేని, తెన్‌కాశి, తూత్తుకుడి, తిరునెల్వేలి, కన్నియాకుమారితో పాటు పుదుచ్చేరి, కారైక్కాల్ ప్రాంతాల్లో కొన్ని చోట్ల భారీ వర్షం కురుస్తుందని వాతావారణ శాఖ తెలిపింది.
ఈవార్తను కూడా చదవండి: KTR: కొడంగల్ నుంచే రేవంత్ భరతం పడతాం
ఈవార్తను కూడా చదవండి: దాడిని ప్రోత్సహించిన వారిని వదిలిపెట్టం
ఈవార్తను కూడా చదవండి: తండ్రిని పట్టించుకోని కొడుక్కి తగిన శాస్తి
ఈవార్తను కూడా చదవండి: రేవంత్ రెడ్డి బ్లాక్ మెయిల్ రాజకీయాలకు పాల్పడుతున్నారు
Read Latest Telangana News and National News
Updated Date - Nov 14 , 2024 | 11:09 AM