ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

IMD: రేపటి నుంచి మళ్లీ వర్షాలు.. ఈ 10 రాష్ట్రాలకు ఐఎండీ హెచ్చరిక

ABN, Publish Date - Oct 03 , 2024 | 09:36 PM

దేశవ్యాప్తంగా గత కొన్ని రోజులుగా బీభత్సం సృష్టించిన వర్షాలు మళ్లీ వచ్చేశాయి. ఈ క్రమంలో రేపటి (అక్టోబర్ 4) నుంచి పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెదర్ రిపోర్ట్ అంచనా వేసింది. ఆ వివరాలేంటో ఇక్కడ తెలుసుకుందాం.

IMD rain alert

దేశంలోని పలు రాష్ట్రాల్లో రుతుపవనాలు ముగియగా, కొన్నిచోట్ల అడపాదడపా వర్షాలు (rains) కురుస్తున్నాయి. ఈ క్రమంలోనే రేపటి (అక్టోబర్ 4) నుంచి పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెదర్ రిపోర్ట్ అంచనా వేసింది. వాతావరణ శాఖ ప్రకారం గల్ఫ్ ఆఫ్ మన్నార్, తూర్పు-మధ్య బంగాళాఖాతంలోని చాలా ప్రాంతాల్లో బలమైన గాలులు వీస్తాయని తెలిపింది. ఇది యూపీ, బీహార్, ఎన్‌సీఆర్‌లపై ప్రభావం చూపుతుందని వెల్లడించింది. ఈ క్రమంలో అక్టోబర్ 5, 6 తేదీలలో ఈ ప్రాంతాల్లోని కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని ఐఎండీ వెల్లడించింది.


ఈ రాష్ట్రాల్లో వర్షాలు

ఈ క్రమంలో ఈశాన్య బంగాళాఖాతం వైపు చేపల వేట కోసం వెళ్లవద్దని వాతావరణ శాఖ సూచించింది. వచ్చే 6 నుంచి 7 రోజుల్లో మహే, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకల్‌లలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. దీంతో పాటు కేరళ, పశ్చిమ బెంగాల్, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మేఘాలయ, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపురలలో అక్టోబర్ 4న భారీ వర్షాలు కురుస్తాయని వెదర్ రిపోర్ట్ చెప్పింది.


తెలుగు రాష్ట్రాల్లో

మరోవైపు తెలంగాణలో వచ్చే మూడు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వెదర్ రిపోర్ట్ అంచనా వేసింది. ప్రధానంగా ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జనగాం, సిద్దిపేట, యాదాద్రి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ జిల్లాల్లో వానలు కురిసే ఛాన్స్ ఉందని వెదర్ రిపోర్ట్ వెల్లడించింది.

ఇక ఏపీలో కూడా రేపటి నుంచి మూడు రోజులు వానలు ఉంటాయని ఐఎండీ తెలిపింది. ఈ నేపథ్యంలో కర్నూల్, ప్రకాశం, నంద్యాల, అనంతపురం, సత్యసాయి, వైఎస్సార్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. దీంతోపాటు అల్లూరి, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, ఉభయ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాలో వానలు కురిసే ఛాన్స్ ఉందని వెల్లడించింది.


ఈ ప్రాంతాల్లో కూడా

వచ్చే వారం రోజుల పాటు వాయువ్య, పశ్చిమ, మధ్య భారత ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం లేదని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. వాతావరణ శాఖ ప్రకారం అక్టోబర్ 4 నుంచి 8 మధ్య కర్ణాటక, కారైకాల్‌లో వర్షాలు కురుస్తాయి. ఢిల్లీలో 2024 రుతుపవనాల సీజన్ 61% వర్షపాతంతో ముగిసిందని వాతావరణ శాఖ తెలిపింది. రుతుపవనాల నిష్క్రమణ తర్వాత ఢిల్లీలో ఉష్ణోగ్రత పెరుగుతుందని వెల్లడించింది.


ఇవి కూడా చదవండి:

Secunderabad to Goa: గోవా వెళ్లే వారికి గుడ్ న్యూస్.. సికింద్రాబాద్ నుంచి ఇకపై 2 ట్రైన్లు


AI Investments: ఏఐ పెట్టుబడులు వృథా..ఎంఐటీ ఆర్థికవేత్త సంచలన వ్యాఖ్యలు


IRCTC: పండుగల సందర్భంగా స్పెషల్ టూర్ ప్యాకేజీ.. తక్కువ ధరకే ప్రసిద్ధ ఆలయాల సందర్శన


Loans: గూగుల్ పే నుంచి క్షణాల్లోనే రూ. 50 లక్షల లోన్స్


SIP Investment: చిరు ఉద్యోగస్తులకు గుడ్‌ న్యూస్.. రూ.99 నుంచే మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులు

Online Shopping Tips: పండుగల సీజన్‌లో ఆన్‌లైన్‌ షాపింగ్ చేస్తున్నారా.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి

Read More Business News and Latest Telugu News

Updated Date - Oct 03 , 2024 | 09:42 PM