ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Alert: ఐఎండీ హెచ్చరిక.. 20 రాష్ట్రాలకు రెయిన్ అలర్ట్..

ABN, Publish Date - Aug 25 , 2024 | 09:41 AM

వచ్చే 24 గంటల్లో మిజోరం, త్రిపుర, పశ్చిమ బెంగాల్ పరివాహక ప్రాంతాల్లో వర్షాలు(rains) కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ (imd) తెలిపింది. ఆదివారం ఢిల్లీలో పలు ప్రాంతాల్లో ఉరుములతో కూడిన తేలికపాటి వర్షం పడే అవకాశం ఉంది. ఈ క్రమంలోనే దేశవ్యాప్తంగా వచ్చే 24 గంటల్లో 20 రాష్ట్రాల్లో వర్షాలు కురియనున్నట్లు వెల్లడించారు.

imd rain alert

దేశవ్యాప్తంగా రుతుపవనాలు మళ్లీ చురుగ్గా మారాయి. ఈ నేపథ్యంలో వచ్చే 24 గంటల్లో మిజోరం, త్రిపుర, పశ్చిమ బెంగాల్ పరివాహక ప్రాంతాల్లో వర్షాలు(rains) కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ (imd) తెలిపింది. ఆదివారం ఢిల్లీలో పలు ప్రాంతాల్లో ఉరుములతో కూడిన తేలికపాటి వర్షం పడే అవకాశం ఉంది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉంది. అదే సమయంలో సోమవారం కూడా వాతావరణం ఇలాగే ఉంటుందని తెలిపింది. మంగళ, బుధవారాల్లో వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ ప్రకటించింది. ఈ క్రమంలో ఆగస్టు 27, 28న చాలా చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ హెచ్చరికలు జారీ చేసింది.


ఏపీతోపాటు..

మరోవైపు నేడు మధ్యప్రదేశ్, తూర్పు రాజస్థాన్, గుజరాత్, మహారాష్ట్రలో మోస్తరు నుంచి భారీ వర్షాలు (heavy rains) కురిసే అవకాశం ఉంది. అదే సమయంలో కోస్తా కర్ణాటక, తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, ఒడిశాలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. ఈశాన్య భారతదేశం, సిక్కిం, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్, బీహార్, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, పశ్చిమ రాజస్థాన్, ఉత్తర కర్ణాటక, అండమాన్ నికోబార్ దీవులలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. దీంతోపాటు జమ్మూ కశ్మీర్, పంజాబ్, హర్యానా, ఢిల్లీ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, కేరళ, లక్షద్వీప్‌లలో కూడా తేలికపాటి వానలు కురుస్తాయని IMD అంచనా వేసింది.

ఇవి కూడా చదవండి:

Kolkata Trainee Doctor Case: కోల్‌కతా డాక్టర్ కేసులో నేడు కీలక విచారణ.. రూట్ మార్చిన నిందితుడు


ఎల్లో అలర్ట్

మరో రెండు రోజుల్లో ఉత్తరాఖండ్‌లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. ఈ క్రమంలో ఆది, సోమవారాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం లేదని వాతావరణ కేంద్రం డైరెక్టర్‌ బిక్రమ్‌సింగ్‌ తెలిపారు. ఈ నేపథ్యంలో ఎల్లో అలర్ట్ ప్రకటించారు. శనివారం యూపీలోని పలు జిల్లాల్లో అడపాదడపా వర్షాలు కురిశాయి. రెండు రోజుల పాటు ఇదే వాతావరణం కొనసాగుతుందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. ఆదివారం బలమైన గాలులు వీస్తాయని, పగటిపూట అడపాదడపా వర్షాలు కురుస్తాయని పేర్కొంది.


3 రోజులపాటు

హిమాచల్ వాతావరణానికి సంబంధించి వాతావరణ శాఖ తాజా అంచనాలను విడుదల చేసింది. ఐఎండీ ప్రకారం ఆగస్టు 25, 26 తేదీలలో రాష్ట్రంలోని చాలా చోట్ల వాతావరణం స్పష్టంగా ఉంటుందని, ఒకటి లేదా రెండు చోట్ల వర్షం కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. ఇదే సమయంలో రాజస్థాన్, గుజరాత్ రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. ఈ క్రమంలోనే రానున్న మూడు రోజుల్లో ఒడిశాలో భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది.


ఇవి కూడా చదవండి:

Dhaka : ఇండో-బంగ్లా సరిహద్దుల్లో ఉద్రిక్తత

Bengaluru : బీమా సొమ్ము కోసం చనిపోయినట్టుగా నాటకం


Bank Holidays: సెప్టెంబర్ 2024లో బ్యాంకు సెలవులు ఎన్నంటే.. గణేష్ చతుర్థి సహా..

Read More National News and Latest Telugu News

Updated Date - Aug 25 , 2024 | 09:43 AM

Advertising
Advertising
<