ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Lok Sabha Polls 2024: 93 లోక్‌సభ స్థానాల్లో.. ప్రశాంతంగా ముగిసిన మూడో దశ పోలింగ్

ABN, Publish Date - May 08 , 2024 | 08:42 AM

ఢిల్లీ: లోక్‌సభ మూడో దశ ఎన్నికల పోలింగ్‌ ప్రశాంతంగా ముగిసింది. మంగళవారం దేశవ్యాప్తంగా 11 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలోని 93 పార్లమెంటు స్థానాలలో మూడో దశ పోలింగ్‌ జరిగింది. చెదురుమదురు ఘటనలు మినహా పోలింగ్‌ ప్రశాంతంగా ముగిసినట్లు ఈసీ వెల్లడించింది.

ఢిల్లీ: లోక్‌సభ మూడో దశ ఎన్నికల పోలింగ్‌ ప్రశాంతంగా ముగిసింది. మంగళవారం దేశవ్యాప్తంగా 11 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలోని 93 పార్లమెంటు స్థానాలలో మూడో దశ పోలింగ్‌ జరిగింది. చెదురుమదురు ఘటనలు మినహా పోలింగ్‌ ప్రశాంతంగా ముగిసినట్లు ఈసీ వెల్లడించింది. రాత్రి ఎనిమిది గంటల వరకు 61.45శాతం పోలింగ్‌ నమోదైనట్లు వెల్లడించింది.

ఇప్పటి వరకు జరిగిన మూడు దశల ఎన్నికలతో 20 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో 283 లోక్‌సభ స్థానాలకు ఎన్నికలు పూర్తయినట్లు ప్రకటించింది. మూడో దశలో గుజరాత్‌, మధ్యప్రదేశ్‌, మహారాష్ట్ర, అసోం, పశ్చిమబెంగాల్‌, బిహార్‌, దాద్రానగర్‌ హవేలీ, డామన్‌ డయ్యూ, కర్ణాటక, ఉత్తర్‌ప్రదేశ్‌, గోవా, ఛత్తీస్‌గఢ్‌లోని స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఇదే దశలో జమ్ముకశ్మీర్‌లోని అనంతనాగ్‌– రాజౌరీ స్థానానికి పోలింగ్‌ జరగాల్సి ఉండగా ఈసీ ఆరో దశకు రీషెడ్యూల్‌ చేసింది.


సూరత్‌ స్థానం ఏకగ్రీవం కావడంతో అక్కడ పోలింగ్‌ జరగలేదు. మూడో దశలో 1331 మంది అభ్యర్థులు ఎన్నికల పోటీలో నిలిచారు. 23 దేశాలకు చెందిన 75 మంది ప్రతినిధులు ఆరు రాష్ట్రాలలోని వివిధ పోలింగ్‌ స్టేషన్లను సందర్శించి ఎన్నికల నిర్వహణ తీరును పరిశీలించారు. మొత్తం ఏడు దశల్లో 543 లోక్‌సభ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్న సంగతి తెలిసిందే. తదుపరి నాలుగో దశలో రెండు తెలుగు రాష్ట్రాల్లోని లోక్‌సభ సీట్లు సహా 96 స్థానాలకు 13న పోలింగ్‌ జరగనుంది. ఏపీ అసెంబ్లీకీ ఈ దశలోనే పోలింగ్‌ జరగనుంది.

ఇది కూడా చదవండి:

West Bengal: నియామకాల రద్దుపై స్టే.. కానీ సీబీఐ విచారణ జరపండి


IRCTC: 8 రోజులు, 7 రాత్రుల స్పెషల్ టూర్ ప్యాకేజీ.. శ్రీకృష్ణుడి ద్వారకా నగరం సహా ఇవి కూడా

Read Latest National News and Telugu News

Updated Date - May 08 , 2024 | 08:42 AM

Advertising
Advertising