Tripura: గంటల వ్యవధిలో మరో దారుణం
ABN, Publish Date - Sep 16 , 2024 | 07:40 AM
కొన్ని గంటల వ్యవధిలోనే త్రిపురలో మరో మైనర్ బాలికపై సామూహిక లైంగిక దాడి ఘటన చోటు చేసుకుంది. దక్షిణ త్రిపుర జిలాల్లో పాఠశాల నుంచి ఇంటికి తిరిగి వస్తున్న ఐదవ తరగతి విద్యార్థినిని ఆగంతకులు కిడ్నాప్ చేశారు. అనంతరం బాలికపై సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారు.
అగర్తల, సెప్టెంబర్ 16: కొన్ని గంటల వ్యవధిలోనే త్రిపురలో మరో మైనర్ బాలికపై సామూహిక లైంగిక దాడి ఘటన చోటు చేసుకుంది. దక్షిణ త్రిపుర జిలాల్లో పాఠశాల నుంచి ఇంటికి తిరిగి వస్తున్న ఐదవ తరగతి విద్యార్థినిని ఆగంతకులు కిడ్నాప్ చేశారు. అనంతరం బాలికపై సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారు. పాఠశాల నుంచి కుమార్తె ఇంటికి తిరిగి రాకపోవడంతో.. ఆమె కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. ఆ క్రమంలో పాఠశాలలో కుమార్తె గురించి వారు వాకబు చేశారు. కానీ వివరాలేవి తెలియలేదు. దీంతో బాలిక తండ్రి బెలోనియా మహిళా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
శనివారం సాయంత్రం బాలికను ఇంటి సమీపంలో ఓ వ్యక్తి వదిలి వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. అతడు వయస్సు 22 ఏళ్లని.. అతడు ఆ పరిసర ప్రాంతాల్లోనే నివసిస్తాడని తమ విచారణలో తెలిసిందని పోలీసులు చెప్పారు. బాలికను కిడ్నాప్ చేసి వివిధ ప్రాంతాల్లో తిప్పుతూ ఆమెపై లైంగిక దాడికి పాల్పడినట్లు పోలీసులు వెల్లడించారు. విద్యార్థినిపై లైంగిక దాడికి సంబంధించి న్యాయ సంహితలోని వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు వివరించారు. అయితే ఈ కేసులో ఇప్పటి వరకు ఎవరిని అరెస్ట్ చేయలేదని పోలీసులు తెలిపారు.
ఇక శుక్రవారం సాయంత్రం ఉత్తర త్రిపుర జిల్లాలోని ఓ మైనర్ బాలికపై లైంగిక దాడి చేసిన కేసులో ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు. వీరిపై కేసు నమోదు చేసినట్లు చెప్పారు. షాప్‌కు వెళ్లి ఇంటికి తిరిగి వస్తున్న బాలికను గురువారం సాయంత్రం ఈ ఇద్దరు వ్యక్తులు సమీపంలోని అడవికి తీసుకు వెళ్లి.. లైంగిక దాడికి పాల్పడ్డారని పోలీసులు వివరించారు.
రహదారి పక్కన స్పృహాలో లేని బాలికను చూసి స్థానికులు వెంటనే స్పందించి ఆసుపత్రికి తరలించారన్నారు. ఈ ఘటనపై బాలిక కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని తెలిపారు. మరోవైపు గత నెలలో దక్షిణ త్రిపుర జిల్లాలో మైనర్ బాలికపై జరిగిన సామూహిక లైంగిక దాడి ఘటనలో ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేసిన విషయం విధితమే.
For More National News and Telugu News
Updated Date - Sep 16 , 2024 | 07:41 AM