UP: దేశ విభజనకు ఇండియా కూటమి కుట్ర ..
ABN, Publish Date - May 06 , 2024 | 05:51 AM
లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో దేశవ్యాప్తంగా సుడిగాలి పర్యటనలు నిర్వహిస్తున్న ప్రధాని మోదీ ఆదివారం ఉత్తర్‌ప్రదేశ్‌లోని అయోధ్యకు చేరుకున్నారు.
ఉత్తరప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో మోదీ
అయోధ్య, మే 5: లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో దేశవ్యాప్తంగా సుడిగాలి పర్యటనలు నిర్వహిస్తున్న ప్రధాని మోదీ ఆదివారం ఉత్తర్‌ప్రదేశ్‌లోని అయోధ్యకు చేరుకున్నారు. అక్కడ రామమందిరాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. జనవరి 22న జరిగిన రామమందిర ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం తర్వాత అయోధ్య రాముణ్ని దర్శించుకోవడం మోదీకి ఇదే తొలిసారి. అనంతరం నిర్వహించిన రోడ్ షోలో ఆయన పాల్గొన్నారు. దాదాపు రెండు కిలోమీటర్ల మేర ఆయన రోడ్ షో కొనసాగింది. అంతకు ముందు ధౌరాహ్రా నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి రేఖా వర్మ నిర్వహించిన ర్యాలీలో మోదీ మాట్లాడారు. కాంగ్రెస్, ఇండియా కూటమి ముస్లింలను పావులుగా వాడుకుంటున్నాయని విమర్శించారు.
ఆ విషయం ముస్లిం సమాజానికి ఇప్పుడిప్పుడే అర్థమవుతోందని అన్నారు. బీజేపీ ప్రభుత్వం అమలు చేస్తోన్న ప్రతీ పథకం ఎటువంటి వివక్షలు లేకుండా ముస్లింలకు అందుతోందని, దాంతో వారు కాంగ్రె్‌సతో కూడిన ఇండియా కూటమికి క్రమంగా దూరమవుతున్నారని పేర్కొన్నారు. అది సహించలేకే ఇప్పుడు రిజర్వేషన్ల పేరుతో కొత్త నాటకానికి తెరలేపాయని ఆరోపించారు. దేశాన్ని విభజించేందుకు ఇండియా కూటమి కుట్ర చేస్తోందని ఆరోపించారు. కర్ణాటకలో రాత్రికిరాత్రే ముస్లింలకు ఓబీసీ కోటా కింద రిజర్వేషన్లు కల్పించారని, ఇప్పుడు అదే ప్రణాళికను దేశవ్యాప్తంగా అమలు చేసేందుకు కాంగ్రెస్, ఇండియా కూటమి ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు.
Updated Date - May 06 , 2024 | 05:51 AM