ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

National:ఫోగట్ అనర్హతపై రాజకీయ దుమారం..!

ABN, Publish Date - Aug 07 , 2024 | 03:45 PM

భారత మహిళా రెజ్లర్ వినేష్ ఫోగట్‌పై పారిస్‌ ఒలింపిక్స్‌లో అనర్హత వేటు పడటంపై దేశంలో రాజకీయ దుమారం చెలరేగుతోంది. ఈ విషయంపై కేంద్రప్రభుత్వాన్ని ఇండియా కూటమి పక్షాలు లక్ష్యంగా చేసుకున్నాయి. వినేష్ అనర్హతపై విపక్షాలు పార్లమెంట్‌లో ప్రభుత్వాన్ని ప్రశ్నించాయి.

Vinesh Phogat

భారత మహిళా రెజ్లర్ వినేష్ ఫోగట్‌పై పారిస్‌ ఒలింపిక్స్‌లో అనర్హత వేటు పడటంపై దేశంలో రాజకీయ దుమారం చెలరేగుతోంది. ఈ విషయంపై కేంద్రప్రభుత్వాన్ని ఇండియా కూటమి పక్షాలు లక్ష్యంగా చేసుకున్నాయి. వినేష్ అనర్హతపై విపక్షాలు పార్లమెంట్‌లో ప్రభుత్వాన్ని ప్రశ్నించాయి. మరోవైపు సోషల్ మీడియాలో సైతం కొందరు కేంద్రప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టులు పెడుతున్నారు. వినేష్ ఫోగట్ ఫైనల్ ఆడకపోవడం వెనుక కుట్ర ఉందని సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ ఆరోపించారు. దీనిపై దర్యాప్తునకు ఆదేశించాలని డిమాండ్ చేశారు. ఈ విషయంలో కేంద్రప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలని ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ కోరారు. కేంద్రప్రభుత్వం, రెజ్లింగ్ ఫెడరేషన్ చేసిన కుట్రగా రైతు నాయకుడు రాకేష్ టికాయిత్ ఆరోపించారు. వినేష్‌ ఫోగట్‌తో ఉన్నవారందరినీ విచారించాలన్నారు.

Olympics 2024: వినేశ్‌పై అనర్హత వేటు.. స్పందించిన ప్రధాని మోదీ


ఫెడరేషన్ రియాక్షన్..

వినేష్ ఫోగట్ పారిస్ ఒలింపిక్స్‌ రెజ్లింగ్ మహిళల 50 కేజీల విభాగంలో ఫైనల్స్ ఆడలేకపోవడం ఎంతో బాధాకరమని రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా పేర్కొంది. కుట్ర కోణంపై ప్రస్తుతానికి ఏమి చెప్పలేమన్నారు. దీని వెనుక కేంద్రప్రభుత్వానికి, ఫెడరేషన్‌ ప్రమేయం లేదన్నారు. వినేష్‌పై అనర్హత దేశానికి జరిగిన నష్టంగా ఫెడరేషన్ నాయకులు పేర్కొన్నారు. ఈ అంశానికి రాజకీయాలకు ఎలాంటి సంబంధం లేదని, దీనిని ఎందుకు రాజకీయం చేస్తున్నారో అర్థం కావడం లేదని ఫెడరేషన్ నాయకులు తెలిపారు.

Olympics 2024: ఒలింపిక్స్ నుంచి వినేశ్ ఫోగట్ ఔట్


అనర్హతకు కారణమిదే..

పారిస్ ఒలింపిక్స్ రెజ్లింగ్ మహిళల 50 కేజీల విభాగంలో భారత క్రీడాకారిణి వినేష్ ఫోగట్ ఫైనల్స్‌ చేరింది. మంగళవారం రాత్రి జరిగిన సెమీఫైనల్స్‌లో క్యూబా క్రీడాకారిణిపై విజయం సాధించడంతో ఆమె భారత్‌కు పతకాన్ని ఖాయం చేసింది. ఫైనల్స్‌లో గెలిచి స్వర్ణం సాధిస్తుందనుకుంటున్న సమయంలో 50 కిలోల కంటే 150 గ్రాముల బరువు ఎక్కువుగా ఉండటంతో ఆమెపై ఒలింపిక్స్ కమిటీ అనర్హత వేసిందన్న వార్త బయటకు వచ్చింది. ఒలింపిక్ నింబధనల ప్రకారం రెజ్లర్లకు తాము ఆడుతున్న కేటగిరీ నుంచి 100 గ్రాముల వరకు మినహాయింపు పొందే అవకాశం ఉంటుంది. దీంతో 50 కేజీలకంటే 100 గ్రాముల వరకు అదనంగా బరువు ఉండొచ్చు. కానీ 150 గ్రాములు ఉండటంతో ఆమె ఒలింపిక్స్ నుంచి నిష్క్రమించాల్సి వచ్చింది.

నాడు న్యాయం కోసం నేడు దేశం కోసం


రాజకీయ దుమారం

బరువు ఎక్కవుగా ఉండటంతో వినేష్ ఫోగట్ ఫైనల్స్ ఆడలేకపోతున్నారంటూ వినేస్ ఫోగట్ తండ్రి ప్రకటించడంతో ఒకసారి ఈ అంశంపై రాజకీయ దుమారం చెలరేగింది. అనర్హత పడటం వెనుక కుట్ర ఉందని వినేష్ బంధువు రాజ్‌పాల్ రాఠీ తెలిపారు. ఈ ప్రకటన వెలువడిన కొద్దిసేపటికే పార్లమెంట్‌లో వినేష్ ఫోగట్ అనర్హత అంశంపై దుమారం రేగింది. ప్రతిపక్షం నుంచి పప్పు యాదవ్, చంద్రశేఖర్, అసదుద్దీన్ ఒవైసీ, హరేంద్ర మాలిక్‌లు లోక్‌సభలో కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. వినేష్‌ను కావాలని టార్గెట్ చేశారంటూ ఎంపీలు ఆరోపించారు. మొత్తం ఘటనపై ప్రభుత్వం సీరియస్‌గా ఉండాలని ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ కోరారు. మొత్తం వ్యవహరంపై విచారణ జరిపించాలని సమాజ్‌వాదీ అధినేత అఖిలేష్ యాదవ్ డిమాండ్ చేశారు. వినేష్ ఫోగట్‌ ఫైనల్‌లో ఆడలేకపోవడానికి గల సాంకేతిక కారణాలపై చర్చించి లోతుగా విచారణ జరిపించి వాస్తవాలను నిర్ధారించుకోవాలని అఖిలేష్ యాదవ్ కోరారు.

ఒకే ఒక్క త్రో...

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Read More Sports News and Latest Telugu News

Updated Date - Aug 07 , 2024 | 03:54 PM

Advertising
Advertising
<