ఐఎస్ఏ అధ్యక్ష స్థానంలో మళ్లీ భారత్
ABN, Publish Date - Nov 05 , 2024 | 04:13 AM
అంతర్జాతీయ సౌర విద్యుత్తు కూటమి (ఇంటర్నేషనల్ సోలార్ అలయెన్స్-ఐఎస్ఏ ) ప్రెసిడెంట్‌గా భారత్ మళ్లీ ఎన్నికయింది. 2026 వరకు రెండేళ్ల పాటు ఈ పదవిలో కొనసాగనుంది. ఉపాధ్యక్ష పదవికి ఫ్రాన్స్ ఎన్నికయింది.
రెండేళ్ల పదవీ కాలానికి ఎన్నిక
న్యూఢిల్లీ, నవంబరు 4: అంతర్జాతీయ సౌర విద్యుత్తు కూటమి (ఇంటర్నేషనల్ సోలార్ అలయెన్స్-ఐఎస్ఏ ) ప్రెసిడెంట్‌గా భారత్ మళ్లీ ఎన్నికయింది. 2026 వరకు రెండేళ్ల పాటు ఈ పదవిలో కొనసాగనుంది. ఉపాధ్యక్ష పదవికి ఫ్రాన్స్ ఎన్నికయింది. సోమవారం ఇక్కడ జరిగిన ఐఎ్‌సఏ ఏడో జనరల్ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి ఈ విషయాన్ని ప్రకటించారు. సౌర విద్యుత్తు రంగానికి ప్రధాని మోదీ చేస్తున్న కృషి కారణంగానే ఈ గుర్తింపు సాధ్యమయిందని తెలిపారు. స్టాండింగ్ కమిటీకి చెందిన ఎనిమిది వైస్‌ప్రెసిడెంట్ స్థానాలు కూడా భర్తీ అయ్యాయి. ఆఫ్రికా ప్రాంతం నుంచి వైస్ ప్రెసిడెంట్లుగా ఘనా, సీషెల్స్ ఎన్నిక కాగా, వాటికి సహకరించే వైస్ చైర్స్ దేశాలుగా దక్షిణ సూడాన్, కామరాన్ దేశాలు ఎన్నికయ్యాయి.
ఆసియా-పసిఫిక్ ప్రాంతం నుంచి ఆస్ట్రేలియా, శ్రీలంక వైస్ ప్రెసిడెంట్లుగా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, పపువా న్యూ గినియా వైస్ చైర్స్‌గా ఎన్నికయ్యాయి. యూరోప్ ప్రాంతం నుంచి గ్రీస్, నార్వే వైస్‌ప్రెసిడెంట్లుగా, జర్మనీ, ఇటలీలు వైస్ చైర్స్‌గా; దక్షిణ అమెరికా, కరేబియన్ ప్రాంతం నుంచి గ్రెనెడా, సురినామ్ వైస్ ప్రెసిడెంట్లుగా, జమైకా, హైతీలు వైస్ చైర్స్‌గా ఎన్నికయ్యాయి. ఐఎస్ఏ డైరెక్టర్ జనరల్‌గా ఆశీష్ కన్నా ఎన్నికయ్యారు. ప్రస్తుత డైరెక్టర్ జనరల్ అజయ్ మాథుర్ వచ్చే ఫిబ్రవరిలో పదవీ విరమణ చేసిన అనంతరం ఆయన బాధ్యతలు చేపట్టనున్నారు.
Updated Date - Nov 05 , 2024 | 04:13 AM