చైనా గూఢచారి బెలూన్లను కూల్చే సత్తా భారత్‌కు..!
ABN, Publish Date - Oct 08 , 2024 | 04:15 AM
ఇతర దేశాలపై నిఘా వేయడానికి చైనా వినియోగిస్తున్న గూఢచారి బెలూన్లను కూల్చడంపై భారత వాయుసేన శిక్షణ పొందినట్లు సమాచారం.
న్యూఢిల్లీ, అక్టోబరు 7: ఇతర దేశాలపై నిఘా వేయడానికి చైనా వినియోగిస్తున్న గూఢచారి బెలూన్లను కూల్చడంపై భారత వాయుసేన శిక్షణ పొందినట్లు సమాచారం. తాజాగా తూర్పు ఎయిర్ కమాండ్‌లో 55వేల అడుగుల కంటే ఎక్కువ ఎత్తులో ఎగురుతున్న చైనా తరహా గూఢచారి బెలూన్‌ను రఫెల్ జెట్‌ను ఉపయోగించి భారత వాయుసేన కూల్చిందని ఓ ఆంగ్ల పత్రిక పేర్కొంది. దీంతో గగనతలంలో నిదానంగా కదిలే భారీ టార్గెట్లను కూడా కూల్చేసే సత్తా భారత్‌కు ఉన్నట్లు తేలింది. 2023లో చైనా బెలూన్ అమెరికా దక్షిణ కరోలినా గగనతలంలో కనిపించగా ఎఫ్-22 యుద్ధ విమానంతో కూల్చేశారు.
Updated Date - Oct 08 , 2024 | 04:15 AM