ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

భారత్‌ లౌకిక దేశంగా ఉండాలని లేదా?

ABN, Publish Date - Oct 22 , 2024 | 03:33 AM

రాజ్యాంగ పీఠిక నుంచి సోషలిస్ట్‌ (సామ్యవాద), సెక్యులర్‌ (లౌకిక) అనే పదాలను తొలగించాలన్న వాదనలపై సుప్రీంకోర్టు సూటిగా స్పందించింది.

  • పిటిషనర్లకు సుప్రీం సూటి ప్రశ్న

  • రాజ్యాంగ పీఠిక నుంచి సోషలిస్ట్‌, సెక్యులర్‌ పదాలను తప్పించాలన్న పిటిషన్లపై విచారణ

న్యూఢిల్లీ, అక్టోబరు 21: రాజ్యాంగ పీఠిక నుంచి సోషలిస్ట్‌ (సామ్యవాద), సెక్యులర్‌ (లౌకిక) అనే పదాలను తొలగించాలన్న వాదనలపై సుప్రీంకోర్టు సూటిగా స్పందించింది. భారత రాజ్యాంగ ప్రాథమిక నిర్మాణంలోనే ఈ పదాలు ఇమిడి ఉన్నాయని తెలిపింది. ఈ విషయాన్ని న్యాయస్థానాలు పలుమార్లు తమ తీర్పుల్లో స్పష్టం చేశాయని గుర్తు చేసింది. రాజ్యాంగ పీఠిక నుంచి ఈ పదాలను తొలగించాలని కోరుతూ బీజేపీ మాజీ ఎంపీ సుబ్రమణ్యస్వామి తదితరులు దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యాలపై జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా, జస్టిస్‌ పీవీ సంజయ్‌కుమార్‌ల ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా పిటిషనర్లలో ఒకరైన న్యాయవాది విష్ణుశంకర్‌జైన్‌ వాదనలు వినిపిస్తూ.. సోషలిస్ట్‌, సెక్యులర్‌ పదాలను చేర్చేందుకు 1976లో చేపట్టిన 42వ రాజ్యాంగ సవరణపై పార్లమెంటులో చర్చే జరగలేదన్నారు.

దీంతో.. ఈ పదాలకు అనేక వివరణలు ఉన్నాయని, కానీ.. వాటిని భిన్నంగా అన్వయించుకుంటున్నారని దీనిపై జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా వ్యాఖ్యానించారు. మరో న్యాయవాది అశ్వినీ ఉపాధ్యాయ్‌ వాదనలు వినిపిస్తూ 42వ సవరణ అమల్లోకి వచ్చేనాటికి నాటి ప్రధాని ఇందిర దేశంలో ఎమర్జెన్సీ విధించారని తెలిపారు. దీనిపై సంజీవ్‌ఖన్నా స్పందిస్తూ, ‘‘మీరు.. భారత్‌ సెక్యులర్‌ దేశంగా ఉండాలనుకోవడంలేదా?’’అని ప్రశ్నించారు. అయితే తాము అలా అనడంలేదని, ఆ సవరణను మాత్రమే సవాలు చేస్తున్నామని న్యాయవాది జైన్‌ చెప్పారు.

పీఠికలో ఈ రెండు పదాలను చేర్చడం ద్వారా కొత్త నిర్ణయాలకు అవకాశం కల్పించినట్లయిందని అన్నారు. బీజేపీ నేత సుబ్రమణ్యస్వామి వాదనలు వినిపిస్తూ.. పీఠికలో 1949 నవంబరు 26 తేదీ ఉండడం తప్పు అని నిరూపిస్తానన్నారు. పీఠిక రెండు భాగాలుగా ఉండొచ్చని, ఒకటి తేదీతో, మరొకటి తేదీ లేకుండా ఉండొచ్చని అన్నారు. సోషలిస్ట్‌, సెక్యులర్‌ పదాలను పీఠికలో చేర్చేందుకు దేశ ప్రజలు అంగీకరించారని చెప్పడం సరికాదన్నారు. దీంతో ఇందుకు సంబంధించిన పత్రాలను పిటిషనర్లు సమర్పిస్తే పరిశీలిస్తామని ధర్మాసనం పేర్కొంది. నోటీసులు జారీ చేసేందుకు మాత్రం నిరాకరించింది. విచారణను నవంబరు 18కి వాయిదా వేసింది.

Updated Date - Oct 22 , 2024 | 03:33 AM