Lok Sabha Election 2024: జూన్ 4న ఓట్ల లెక్కింపు ప్రక్రియ.. ఎన్నికల సంఘం కీలక ప్రకటన
ABN, Publish Date - Jun 02 , 2024 | 09:28 AM
లోక్‌సభ 2024 ఎన్నికల (Lok Sabha Election 2024) ఏడో దశ పోలింగ్ శనివారం ముగిసింది. ఓట్ల లెక్కింపు ప్రక్రియ జూన్ 4న జరగనుంది. వీటి ఫలితాల కోసం పౌరులతోపాటు రాజకీయ పార్టీల నేతలు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో ఓట్ల లెక్కింపునకు(counting) ఇప్పుడు సన్నాహాలు ఊపందుకున్నాయి.
లోక్‌సభ 2024 ఎన్నికల (Lok Sabha Election 2024) ఏడో దశ పోలింగ్ శనివారం ముగిసింది. ఓట్ల లెక్కింపు ప్రక్రియ జూన్ 4న జరగనుంది. వీటి ఫలితాల కోసం పౌరులతోపాటు రాజకీయ పార్టీల నేతలు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో ఓట్ల లెక్కింపునకు(counting) ఇప్పుడు సన్నాహాలు ఊపందుకున్నాయి. ఈవీఎంలు ఉంచిన కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు.
దేశవ్యాప్తంగా 543 లోక్‌సభ స్థానాలకు ఏడు దశల్లో పోలింగ్(polling) పూర్తయింది. దీంతో పాటు పలు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు కూడా జరిగాయి. ఇప్పుడు అభ్యర్థుల రాజకీయ భవిష్యత్తు ఈవీఎంలలో నిక్షిప్తమైంది. అయితే ఈ ఓట్ల లెక్కింపు ప్రక్రియ జూన్ 4న ఉదయం 8 గంటలకు ప్రారంభమవుతుందని ఎన్నికల సంఘం తెలిపింది. కానీ ఆదివారం (జూన్ 2న) ఉదయం 6 గంటలకు లోక్‌సభ ఎన్నికలతో పాటు సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమైంది.
చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్, ఎన్నికల కమిషనర్లు జ్ఞానేష్ కుమార్, సుఖ్‌బీర్ సింగ్ సంధుతో కలిసి ఓట్ల లెక్కింపు సన్నాహాలను అన్ని ప్రధాన ఎన్నికల అధికారులు, రిటర్నింగ్ అధికారులతో సమీక్షించారు. ఓట్ల లెక్కింపు ఫలితాలు కమిషన్ వెబ్‌సైట్‌తో పాటు ఓటర్ హెల్ప్‌లైన్ యాప్ iOS, Android మొబైల్ యాప్‌లలో అందుబాటులో ఉంటాయని ఎన్నికల సంఘం తెలిపింది. ఓటర్(voter) హెల్ప్‌లైన్ యాప్‌ను గూగుల్ ప్లే స్టోర్ లేదా యాపిల్ ప్లే స్టోర్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చని సూచించారు.
వినియోగదారులు ఓటర్ హెల్ప్‌లైన్ యాప్ నుంచి నియోజకవర్గాల వారీగా లేదా రాష్ట్రాల వారీగా ఫలితాలను అలాగే విజేత లేదా లీడింగ్ లేదా వెనుకబడిన అభ్యర్థుల వివరాలను తెలుసుకోవడానికి ఫిల్టర్‌లను ఉపయోగించవచ్చని స్పష్టం చేశారు. ఈ క్రమంలో రిటర్నింగ్ అధికారులు, కౌంటింగ్ ఏజెంట్ల కోసం కమిషన్ ఓ బుక్‌లెట్‌ను విడుదల చేసింది. కౌంటింగ్ ఏర్పాట్లు, కౌంటింగ్ ప్రక్రియ కోసం కమిషన్ సూచనలు ఇప్పటికే ఎన్నికల సంఘం(election commission of india) వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయి.
ఇది కూడా చదవండి:
Notes Votes : ఓట్ల కోసం నోట్ల వర్షం!
CIBIL Score: సిబిల్ స్కోర్ ఎక్కువ సార్లు చెక్ చేస్తున్నారా.. అయితే ఈ సమస్యలు తప్పవు
Read Latest National News and Telugu News
Updated Date - Jun 02 , 2024 | 09:29 AM