ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Big Breaking: కెనడాలోని దౌత్యవేత్తలు వెనక్కి.. భారత్ సంచలన నిర్ణయం

ABN, Publish Date - Oct 14 , 2024 | 08:47 PM

భారత్-కెనడా మధ్య దౌత్యసంబంధాలు మరింత దిగజారడంతో భారత్ కీలక నిర్ణయం తీసుకుంది. కెనడాలోని భారత హై కమిషనర్ సంజయ్ కుమార్ వర్మ సహా పలువురు దౌత్యవేత్తలను వెనక్కి రప్పించాలని భారత ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

న్యూఢిల్లీ: భారత్-కెనడా (India-Canada) మధ్య దౌత్యసంబంధాలు మరింత దిగజారడంతో భారత్ కీలక నిర్ణయం తీసుకుంది. కెనడాలోని భారత హై కమిషనర్ సంజయ్ కుమార్ వర్మ సహా పలువురు దౌత్యవేత్తలను వెనక్కి రప్పించాలని భారత ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టు విదేశాంగ శాఖ (MEA) సోమవారం సాయంత్రం ప్రకటించింది. భారత కమిషనర్, ఇతర దౌత్యవేత్తలు, అధికారులపై కెనడా చేస్తు్న్న నిరాధార ఆరోపణలు తమకెంత మాత్రం ఆమోదయోగ్యం కాదని ఎంఈఏ ఒక ప్రకటనలో పేర్కొంది.

India-Canada: కెనడా దౌత్యవేత్తకు భారత్ సమన్లు.. ఘర్షణాత్మక వైఖరిపై తీవ్ర నిరసన


"తీవ్రవాదం, హింసాత్మక వాతావరణం కనిపిస్తున్నందున ట్రూడో ప్రభుత్వ చర్యలతో వారి భద్రతకు ప్రమాదం కలగవచ్చు. భారత దౌత్యవేత్తలకు భద్రత కల్పించే విషయంలో ప్రస్తుత ట్రూడో సర్కార్‌పై మాకు విశ్వాసం లేదు. ఆ కారణంగానే, హై కమిషనర్, ఇతర లక్షిత దౌత్యవేత్తలను, అధికారులను ఉపసంహరించుకోవాలని భారత ప్రభుత్వం నిర్ణయించింది'' అని ఎంఈఏ ఆ ప్రకటనలో పేర్కొంది. ట్రూడో ప్రభుత్వం భారత్‌కు వ్యతిరేకంగా తీవ్రవాదం, హింస, వేర్పాటువాదానికి మద్దతు ఇస్తున్నందున అందుకు ప్రతిగా చర్చలు తీసుకునే హక్కు ఇండియా కలిగి ఉందని కూడా ఎంఈఏ స్పష్టం చేసింది.


తాజా వివాదం ఏమిటి?

కెనడాలోలో గత ఏడాది జరిగిన ఖలిస్థాన్ ఉగ్రవాది నిజ్జర్ హత్య కేసు విచారణలో భాగంగా భారత హైకమిషనర్ సంజయ్ కుమార్ వర్మతో సహా పలువురు దౌత్యవేత్తలను అనుమానితుల (Persons of intrest) జాబితాలో ట్రుడూ సర్కార్ చేర్చింది. ఇందుకు సంబంధించి కెనడా నుంచి దౌత్య సమాచారం ఆదివారం భారత్‌కు చేరడంతో ఇండియా నిప్పులు చెరిగింది. ట్రూడో ప్రభుత్వ అభియోగం పూర్తిగా అసంబద్ధమని పేర్కొంటూ, దీనిపై నిరసన తెలిపేందుకు కెనడా డిప్యూటీ హై కమిషనర్ స్టెవార్డ్ వీలర్‌కు భారత్ సమన్లు పంపింది.


గతంలోనూ..

కెనడా పౌరుడు హర్దీప్ సింగ్ నిజ్జర్‌ హత్యలో భారత ఏజెంట్ల ప్రమేయం ఉందంటూ గత ఏడాది సెప్టెంబర్‌లో కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో తీవ్ర ఆరోపణలు చేసినప్పటి నుంచి భారత్-కెనడా మధ్య దౌత్య సంబంధాలు దెబ్బతిన్నాయి. ట్రూడో ఆరోపణలను భారత్ నిర్ద్వంద్వంగా తోసిపుచ్చింది. రాజకీయ దురుద్దేశాలతోనే ఇలాంటి ఆరోపణలు చేస్తు్న్నట్టు ఆక్షేపణ తెలిపింది. కెనడా గడ్డపై ఖలిస్థాన్ అనుకూలవాదులకు చోటు ఇవ్వడాన్ని తప్పుపట్టింది. ఇరుదేశాల మధ్య ప్రధాన అంశం ఏదైనా ఉండే ఇదేనని చెప్పింది. భారత్‌లో వేర్పాటువాదాన్ని ఎగదోసే వారిని మంత్రివర్గంలో చేర్చుకోవడాన్ని గుర్తు చేసింది.


ట్రూడో రాజకీయ లబ్ధి కోసమే..

ట్రూడో ప్రభుత్వం ఓటు బ్యాంకు రాజకీయాల కోసమే భారత హైకమిషనర్ వర్మపై ఉద్దేశపూర్వకమైన ఆరోపణలు చేస్తోందని, ట్రూడో 2023లో ఆరోపణలు చేసినప్పటి నుంచి తమ ఆరోపణలకు సంబంధించిన ఎలాంటి సమాచారాన్ని భారత్‌తో పంచుకోలేదని విదేశాంగ శాఖ తాజాగా వెల్లడించింది. తాము పలుమార్లు అభ్యర్థనలు చేసినప్పటికీ పట్టించుకోలేదని పేర్కొంది. తాజా పరిణామాలను బట్టి చూస్తే ట్రూడో సర్కార్ విచారణ పేరుతో కేవలం రాజకీయ లబ్ధి కోసమే భారత్‌పై విమర్శలు చేస్తున్నట్టుందని ఆగ్రహం వ్యక్తం చేసింది. భారత రాజకీయాల్లో ట్రూడో నేరుగా జ్యోకం చేసుకునే ప్రయత్నం చేస్తున్నారంటూ తప్పుపట్టింది. భారత హైకమిషనర్ సంజయ్ కుమార్‌ వర్మకు 36 ఏళ్ల దౌత్య అనుభవం ఉందని గుర్తు చేసింది. ''భారత దౌత్యవేత్తలపై కల్పిత ఆరోపణలతో కెనడా ప్రభుత్వం చేస్తున్న తాజా ప్రయత్నాలపై తదుపరి చర్యలకు తీసుకునేందుకు భారత్‌కు సర్వ హక్కులున్నాయ'' అని ఎంఈఏ నిష్కర్షగా తేల్చిచెప్పింది.


మరిన్ని జాతీయ వార్తలు కోసం క్లిక్ చేయండి..

ఇది కూడా చదవండి..

‘ఆయుష్మాన్‌’లో వృద్ధులకు మరిన్ని ప్రయోజనాలు

Updated Date - Oct 14 , 2024 | 08:53 PM