Viral Video: ఎత్తైన ప్రాంతంలో యోగా చేసిన ఆర్మీ సైనికులు
ABN, Publish Date - Jun 21 , 2024 | 07:54 AM
భారత సరిహద్దుల్లో మంచుతో ఉన్న ఎత్తైన శిఖరాల మధ్య ఆర్మీ సైనికులు నేడు యోగా డే సందర్భంగా యోగా సాధన చేశారు. అంతేకాదు మంచు మధ్య యోగా చేస్తూ సూర్య నమస్కారాలతో ఫిట్‌గా ఉండాలనే సందేశాన్ని కూడా సైనికులు ప్రజలకు అందించారు. అందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో షేర్ చేయగా ప్రస్తుతం అవి వైరల్ అవుతున్నాయి.
భారత సరిహద్దుల్లో మంచుతో ఉన్న ఎత్తైన శిఖరాల మధ్య ఆర్మీ సైనికులు(Indian Army personnel) నేడు యోగా డే(International Yoga Day 2024) సందర్భంగా యోగా సాధన చేశారు. అంతేకాదు మంచు మధ్య యోగా చేస్తూ సూర్య నమస్కారాలతో ఫిట్‌గా ఉండాలనే సందేశాన్ని సైనికులు ప్రజలకు అందించారు. దీంతోపాటు నేడు దేశంలోని అనేక ప్రాంతాల్లో యోగా శిబిరాలు ఏర్పాటు చేసి పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొని యోగా మెళకువలు నేర్చుకున్నారు.
మరోవైపు తూర్పు లడఖ్‌లో(Eastern Ladakh) కూడా ఆర్మీ సైనికులు యోగా ఆసనాలు వేశారు. 10వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని యోగా చేస్తూ కనిపించారు. ఈ దృశ్యాలు చూపరులను ఆకట్టుకుంటున్నాయి. అందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో షేర్ చేయగా ప్రస్తుతం అవి వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో దేశంలోని ఎత్తైన ప్రాంతాల్లో చేసిన యోగా దృశ్యాలను ఇప్పుడు చుద్దాం.
ఈరోజు భారతదేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా(world wide) 10వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటున్నారు. దేశంలోని అనేక చారిత్రక కేంద్రాల్లో మంత్రులు, పిల్లలు, మహిళలు సహా అనేక మంది పాల్గొని యోగా చేస్తున్నారు. యోగా ద్వారా శారీరక అవయవాలతో పాటు మనస్సు, మెదడు, ఆత్మకు సమతుల్యత చేకూరుతుందని యోగా నిపుణులు చెబుతున్నారు. క్రమం తప్పకుండా యోగా సాధన చేయడం వల్ల శారీరక, మానసిక సమస్యల నుంచి కూడా ఉపశమనం పొందవచ్చని వెల్లడించారు.
ఇది కూడా చదవండి:
International Yoga Day 2024: నేడు అంతర్జాతీయ యోగా దినోత్సవం.. ఎప్పటి నుంచి జరుపుతున్నారు..
Gold and Silver Rates Today: బంగారం, వెండి ధరలు భారీగా జంప్..ఎంతకు చేరాయంటే
Read Latest National News and Telugu News
Updated Date - Jun 21 , 2024 | 08:03 AM