ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

కొత్త గ్రహాన్ని కనుగొన్న భారత శాస్త్రవేత్తలు

ABN, Publish Date - Oct 29 , 2024 | 04:30 AM

విశ్వంలో మరో కొత్త గ్రహాన్ని భారత శాస్త్రవేత్తలు కనుగొన్నారు. అధునాతన స్పెక్టోగ్రా్‌ఫను ఉపయోగించి ఆ గ్రహాన్ని గుర్తించామని..

న్యూఢిల్లీ, అక్టోబరు 28: విశ్వంలో మరో కొత్త గ్రహాన్ని భారత శాస్త్రవేత్తలు కనుగొన్నారు. అధునాతన స్పెక్టోగ్రా్‌ఫను ఉపయోగించి ఆ గ్రహాన్ని గుర్తించామని.. ఇదో అద్భుత ఆవిష్కరణ అని ఫిజికల్‌ రీసెర్చ్‌ ల్యాబొరేటరీ (పీఆర్‌ఎల్‌) కి చెందిన పరిశోధకులు పేర్కొన్నారు. ఈ గ్రహాన్ని టీఓఐ-6651బీగా పిలుస్తున్నామని తెలిపారు. శని గ్రహం పరిణామంలో ఉన్న ఈ ప్రత్యేక గ్రహం.. సూర్యుడిని పోలిన నక్షత్రం చుట్టూ తిరుగుతోందని వెల్లడించారు. దీని కక్ష్య కొద్దిగా అండాకారంలో ఉందన్నారు. ఇక భూమితో పోలిస్తే ఈ గ్రహం బరువు 60 రెట్లు అధికంగా ఉంటుందని, పరిమాణంలో 5 రెట్లు పెద్దదని వివరించారు. ఈ గ్రహం అధిక సాంద్రతను బట్టి 87ు రాతి, ఇనుము పదార్థాలను సూచిస్తుందన్నారు. హైడ్రోజన్‌, హీలియం వంటి తేలిక వాయువులు గ్రహంపై వ్యాపించి ఉండే అవకాశముందన్నారు.

Updated Date - Oct 29 , 2024 | 04:30 AM