ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Bangladesh Violence: భారతీయ వీసా సెంటర్లు క్లోజ్.. యూరప్‌కు హసీనా

ABN, Publish Date - Aug 08 , 2024 | 12:38 PM

ప్రధాని పదవి నుంచి వైదొలిగిన షేక్ హాసినా భారత్ నుంచి లండన్‌ వెళ్లి.. అక్కడ ఆశ్రయం పొందాలని ఆకాంక్షించారు. కానీ లండన్ మాత్రం అందుకు తమ నిబంధనలను ఒప్పుకోవని తేల్చి చెప్పింది. ఈ నేపథ్యంలో షేక్ హసీనాకు యూరోపియన్ దేశంలో ఆశ్రయం కల్పించే దిశగా భారత్ ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్లు సమాచారం.

ఢాకా, ఆగస్ట్ 08: బంగ్లాదేశ్ ప్రధాని పదవికీ షేక్ హసీనా రాజీనామా చేయాలంటూ దేశవ్యాప్తంగా చేపట్టిన ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. దాంతో బంగ్లాదేశ్‌లో అస్థిర పరిస్థితులు ఏర్పాడాయి. ఈ నేపథ్యంలో ఆ దేశంలోని భారతీయ వీసా కేంద్రాలన్నీ నిరవధికంగా అధికారులు మూసి వేశారు. మళ్లీ ఈ కేంద్రాలను ఎప్పుడు తెరిచేది ముందుగానే వెల్లడిస్తామన్నారు. అలాగే వెబ్‌సైట్ ద్వారా, ఎస్ఎంఎస్‌ల ద్వారా తెలియ జేస్తామని పేర్కొన్నారు.

Also Read:LokSabha: వక్ఫ్ బోర్డ్ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా కాంగ్రెస్ నోటీసులు


కుటుంబాలతో స్వెదేశానికి వెళ్లిన.. భారత రాయబార సిబ్బంది

సోమవారం షేక్ హసీనా ప్రభుత్వం కుప్పకూలిన అనంతరం ఢాకాలోని భారత రాయబారి కార్యాలయంతోపాటు దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న అసిస్టెంట్ హై కమిషన్ కార్యాలయాల్లో విధులు నిర్వహిస్తున్న 190 మంది అవసరం లేని సిబ్బంది.. తమ కుటుంబాలతో భారత్‌కు వెళ్లారని తెలిపారు. దేశంలో వివిధ దేశాలకు చెందిన దౌత్య కార్యాలయాలు మాత్రం విధులు నిర్వహిస్తున్నాయని అధికార వర్గాలు ఈ సందర్భంగా వెల్లడించాయి.

Maharashtra politics: తమ్ముడు నేటి నుంచి.. అన్నయ్య రేపటి నుంచి..

Also Read: Viral: గర్ల్ ఫ్రెండ్‌ కోసం.. ఓ టీనేజర్ ఘనకార్యం


జూన్‌లో రిజర్వేషన్లు.. జులైలో హసీనా

ఈ ఏడాది జూన్‌లో రిజర్వేషన్లు సంస్కరించాలంటూ.. దేశవ్యాప్త ఆందోళనకు విద్యార్థులు పిలుపునిచ్చారు. తొలుత శాంతియుతంగా సాగిన ఆ ఆందోళన ఆ తర్వాత.. హింసకు దారి తీసింది. దీంతో దేశవ్యాప్తంగా ప్రభుత్వం కర్ఫ్యూ విధించారు. అయినా పరిస్థితులు మాత్రం కొలిక్కి రాలేదు. ఈ సందర్భంగా ప్రభుత్వం విద్యార్థి సంఘాలను చర్చలకు పిలిచినా.. అవి సఫలం కాలేదు. ఆ క్రమంలో ప్రధాన మంత్రి పదవికి షేక్ హసీనా రాజీనామా చేయాలంటూ..దేశవ్యాప్తంగా ఆందోళనలు, నిరసనలకు విద్యార్దులు పిలుపునిచ్చారు.

Also Read:Bangladesh Violence: భారత్‌లోని బంగ్లాదేశీ విద్యార్థుల్లో ‘ఆందోళన’

దీంతో తీవ్ర హింస చోటు చేసుకుంది. దాంతో ప్రధాన మంత్రి పదవికి షేక్ హసీనా రాజీనామా చేయక తప్పని పరిస్థితి ఏర్పడింది. దీంతో హసీనా తన పదవికి రాజీనామా చేశారు. అనంతరం తన సోదరి రెహనాతో కలిసి ఆమె పొరుగునున్న భారత్‌కు వెళ్లి తల దాచుకున్నారు. ఇక బంగ్లాదేశ్‌లో కొత్త మధ్యంతర ప్రభుత్వం కొలువు తీరనుంది. నోబెల్ పురస్కార గ్రహీత, బ్యాంకర్ ప్రొ. మహమ్మద్ యూనస్ సారథ్యలో ఈ ప్రభుత్వం గురువారం ఏర్పాటు కానుంది.

Also Read: Vinesh Phogat: ‘నాపై కుస్తీ గెలిచింది.. నేను ఓడిపోయాను’


లండన్ కాదు.. యూరోపియన్ దేశానికి షేక్ హసీనా...

ప్రధాని పదవి నుంచి వైదొలిగిన షేక్ హాసినా భారత్ నుంచి లండన్‌ వెళ్లి.. అక్కడ ఆశ్రయం పొందాలని ఆకాంక్షించారు. కానీ లండన్ మాత్రం అందుకు తమ నిబంధనలను ఒప్పుకోవని తేల్చి చెప్పింది. ఈ నేపథ్యంలో షేక్ హసీనాకు యూరోపియన్ దేశంలో ఆశ్రయం కల్పించే దిశగా భారత్ ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. మరోవైపు షేక్ హసీనాకు మోదీ ప్రభుత్వం ఆశ్రయం కల్పించడంపై భారత్‌లోని బంగ్లాదేశ్ విద్యార్థులు సైతం సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు.. ప్రధాన మంత్రి మోదీకి వారు ధన్యవాదాలు తెలిపారు.

Read More National News and Latest Telugu News

Updated Date - Aug 08 , 2024 | 12:42 PM

Advertising
Advertising
<