ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Digital Arrests: బాబోయ్ అన్ని కోట్లా... డిజిటల్ అరెస్ట్ స్కామ్‌లపై కేంద్రం షాకింగ్ రిపోర్ట్

ABN, Publish Date - Oct 28 , 2024 | 12:00 PM

ఈ మధ్య కాలంలో ‘డిజిటల్ అరెస్ట్’ మోసాలు ఎక్కువగా జరుగుతున్నాయి. ఇదొక సైబర్ మోసం. కేటగాళ్లు ప్రభుత్వాధికారులుగా నమ్మించి.. కేసుల్లో ఇరుకున్నట్టుగా అమాయకులను నమ్మిస్తున్నారు. విచారణ పేరిట ఆన్‌లైన్‌లో వారి ఆధీనంలోనే ఉంచుకుంటున్నారు. ఈ క్రమంలో భారీగా డబ్బు గుంజుతున్నారు. ఈ నేరాలకు సంబంధించి కేంద్రం విడుదల చేసిన రిపోర్ట్ షాక్‌కు గురిచేస్తోంది.

దేశంలో ‘డిజిటల్ అరెస్ట్ మోసాలు’ (Digital Arrest Scams) అంతకంతకూ పెరిగిపోతున్నాయి. సీబీఐ లేదా ఈడీ నుంచి, లేదా పోలీసు అధికారులమంటూ నమ్మించి.. ఏదో ఒక నేరంలో ఇరుక్కుపోయినట్టు భ్రమ కల్పించి పెద్ద మొత్తంలో డబ్బులు గుంజుతున్నారు. ఈ తరహా మోసాల సంఖ్య పెరిగిపోతుండడంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వయంగా నిన్న (ఆదివారం) దేశ పౌరులకు అవగాహన కల్పించారు. 115వ ‘మన్ కీ బాత్’ రేడియో ప్రసంగంలో ఈ స్కామ్‌లపై మాట్లాడారు. తస్మాత్ జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో డిజిటల్ మోసాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన నివేదిక షాక్‌కు గురిచేస్తోంది.


2024 ఆరంభంలో దేశంలో భారీగా డిజిటల్ అరెస్ట్ స్కామ్‌లు జరిగాయి. తొలి నాలుగు నెలలు అంటే జనవరి నుంచి ఏప్రిల్ మధ్య జరిగిన ‘డిజిటల్ అరెస్ట్’ స్కామ్‌ల కారణంగా నేరగాళ్లు మొత్తం రూ.120.3 కోట్లను దోచుకున్నారు. ఈ మేరకు నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ 2024 (NCRP) మొదటి నాలుగు నెలల్లో జరిగిన సైబర్ నేరాలకు సంబంధించిన నివేదికలో పేర్కొంది.

తొలి నాలుగు నెలల్లో దాపు 7.4 లక్షల సైబర్ క్రైమ్ ఫిర్యాదులు అందాయని ఎన్‌సీఆర్‌పీ తెలిపింది. గతేడాది 2023లో మొత్తం 15.56 లక్షల ఫిర్యాదులు అందాయని, 2022లో ఈ సంఖ్య 9.66 లక్షలుగా, 2021లో 4.52 లక్షలుగా ఉన్నాయని పేర్కొంది.


ఈ ఏడాది మొదటి నాలుగు నెలల కాలంలో పెద్ద సంఖ్యలో సైబర్ క్రైమ్‌లు జరిగాయని, ట్రేడింగ్ స్కామ్‌ల పేరిట రూ.1,420.48 కోట్లు, ఇన్వెస్ట్‌మెంట్ మోసాల కారణంగా రూ.222.58 కోట్లు, డేటింగ్ స్కామ్‌ల పేరిట రూ.13.23 కోట్లు ఇలా పెద్ద మొత్తంలో బాధితులు మోసపోయారని ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ (I4సీ) సీఈవో రాజేష్ కుమార్ తెలిపారు.


ఇవి కూడా చదవండి

విమాన ప్రయాణంలో శునకం మృతి.. యజమాని ఏం చేశాడంటే

ఐరన్‌మ్యాన్ ఛాలెంజ్ పూర్తి చేసిన బీజేపీ ఎంపీ.. ప్రధాని మోదీ రియాక్షన్ ఇదే

ఆ కాలంపోయింది.. కివీస్ చేతిలో భారత్ ఓటమిపై డివిలియర్స్ ఆసక్తికర వ్యాఖ్యలు

For more Viral News and Telugu News

Updated Date - Oct 28 , 2024 | 12:23 PM