IndiGo Flight Incident: పైలట్‌ని ప్యాసింజర్ కొట్టిన ఘటనలో ‘హనీమూన్’ ట్విస్ట్..?
ABN , Publish Date - Jan 16 , 2024 | 07:31 PM
రీసెంట్‌గా ఇండిగో ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఢిల్లీ-గోవా 6E2175 విమానం కొన్ని గంటలపాటు ఆలస్యం కావడంతో.. కో-కెప్టెన్‌పై ఒక ప్యాసింజర్ దాడి చేసిన విషయం తెలిసిందే. ఆలస్యానికి గల కారణాలేంటో కో-కెప్టెన్ అనూప్ కుమార్ వివరిస్తుండగా.. సాహిల్ కతారియా అనే ప్రయాణికుడు ఒక్కసారిగా దూసుకొచ్చి ఆయన్ను కొట్టాడు.
రీసెంట్‌గా ఇండిగో ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఢిల్లీ-గోవా 6E2175 విమానం కొన్ని గంటలపాటు ఆలస్యం కావడంతో.. కో-కెప్టెన్‌పై ఒక ప్యాసింజర్ దాడి చేసిన విషయం తెలిసిందే. ఆలస్యానికి గల కారణాలేంటో కో-కెప్టెన్ అనూప్ కుమార్ వివరిస్తుండగా.. సాహిల్ కతారియా అనే ప్రయాణికుడు ఒక్కసారిగా దూసుకొచ్చి ఆయన్ను కొట్టాడు. అందుకు అతనిపై తగిన చర్యలు కూడా తీసుకోవడం జరిగింది. అయితే.. లేటెస్ట్‌గా ఆ ప్రయాణికుడు ఈ దాడి చేయడం వెనుక గల అసలైన కారణమేంటో వెలుగులోకి వచ్చింది. అతడు హనీమూన్ కోసం గోవాకి వెళ్తున్నాడని, కానీ 12 గంటలపాటు ఫ్లైట్ ఆలస్యం కావడంతో సహనం కోల్పోయి ఈ దాడి చేశాడని తేలింది.
ఢిల్లీ పోలీసు వర్గాల సమాచారం ప్రకారం.. సాహిల్ కతారియా ఐదు నెలల క్రితమే వివాహం చేసుకున్నాడని, హనిమూన్ కోసం గోవాకు వెళ్తున్నాడని తెలిసింది. ఎంతో ఉత్సాహంగా అతడు ఈ ప్లాన్ సిద్ధం చేసుకున్నాడని, అయితే ఫ్లైట్ పది గంటలకు పైగా ఆలస్యం కావడంతో అతడు సహనం కోల్పోయాడని, ఆ కోపంలోనే కో-పైలట్‌తో ఘర్షణకు దిగాడని వెల్లడైంది. అయితే.. బెయిల్‌పై విడుదలైన సాహిల్ కతారియా వాదన మాత్రం మరోలా ఉంది. టేకాఫ్ గురించి పైలట్లు తనతో పాటు ఇతర ప్రయాణికులకు సరైన సమాచారం ఇవ్వకుండా తప్పుదారి పట్టించారని, ఈ విషయమే తనని తీవ్ర ఆగ్రహావేశాలకు గురయ్యేలా చేసిందని, ఈ క్రమంలోనే తాను కో-పైలట్‌పై చెయ్యి చేసుకున్నానని చెప్పుకొచ్చాడు.
ఇదిలావుండగా.. ఉత్తర భారతదేశంలో వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో చాలా విమానాలు రద్దు అయ్యాయి. కొన్ని ఎయిర్‌పోర్టులలోనే గంటలపాటు నిలిచిపోయాయి. వాటిల్లో ఢిల్లీ-గోవా 6E2175 విమానం ఒకటి. తొలుత ఒక గంట పాటు ఆలస్యమని చెప్పి.. ప్రయాణికుల్ని పది గంటల పాటు కూర్చోబెట్టారు. అనంతరం మరో రెండు గంటలు ఆలస్యమవుతుందని కో-పైలట్ చెప్తుండగానే సాహిల్ దూసుకొచ్చి ఎటాక్ చేశాడు. అతని దాడిని కొందరు నెటిజన్లు ఖండించగా, మరికొందరు మాత్ర మద్దతు తెలిపారు. 12 గంటలపాటు అలాగే కూర్చోబెడితే, ఎవరికైనా కోపం వస్తుందని సాహిల్ చర్యని సమర్థించారు.