Maharashtra: సునేత్ర పవార్ పోస్టర్‌పై ఇంకు చల్లిన ఆగంతకులు.. కారణం ఏమిటంటే..?
ABN, Publish Date - Feb 11 , 2024 | 06:57 PM
మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ నేత అజిత్ పవార్ భార్య సునేత్ర పవార్ పోస్టర్‌పై కొందరు అగంతకులు ఇంక్ చల్లడం కలకలం సృష్టించింది. పుణె జిల్లాలోని బారామతి తాలూకా కర్హటి గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
ముంబై: మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (NCP) నేత అజిత్ పవార్(Ajit Pawar) భార్య సునేత్ర పవార్ (Sunetra Pawar) పోస్టర్‌పై కొందరు అగంతకులు ఇంక్ చల్లడం కలకలం సృష్టించింది. పుణె జిల్లాలోని బారామతి తాలూకా కర్హటి గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. సునేత్ర పవార్‌ను భావి ఎంపీగా ఫోకస్ చేస్తూ ఈ పోస్టర్ ఏర్పాటైంది. శరద్ పవార్ కుమార్తె, అజిత్ పవార్ కజిన్ సుప్రియా సూలే ప్రస్తుతం బారామతి ఎంపీగా ఉన్నారు. అగంతకులు సునేత్ర పవార్ పోస్టర్‌పై ఇంక్ చల్లడానికి ఇది ఒక కారణం కావచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసులు ఆ ప్రాంతానికి చేరుకుని బ్యానర్‌ను తొలగించారు.
ఎన్‌సీపీలో చీలిక నేపథ్యంలో అజిత్ పవార్ సారథ్యంలోని ఎన్‌సీపీని నిజమైన ఎన్‌పీగా ఎన్నికల కమిషన్ ఇటీవల ప్రకటించింది. అజిత్ వర్గానికే పార్టీ పేరు, గుర్తు కేటాయించింది. ఈ నేపథ్యంలో సునేత్ర పవార్ లోక్‌సభ అభ్యర్థిత్వంపై పోస్టర్ వెలుగు చూడటం కలకలం రేపింది. అయితే గతంలోనూ బారామతిలో సునేత్రా పవార్ అభ్యర్థిత్వానికి సంబంధించిన పోస్టర్లు వెలిసాయి. బారామతి అసెంబ్లీ నియోజకవర్గానికి అజిత్ పవార్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
Updated Date - Feb 11 , 2024 | 06:57 PM