ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

IPS officers: 18 మంది ఐపీఎస్ అధికారుల బదిలీ..

ABN, Publish Date - Jul 10 , 2024 | 11:14 AM

రాష్ట్ర ప్రభుత్వం 18 మంది ఐపీఎస్‌ అధికారులను(IPS officers) బదిలీ చేస్తూ మంగళవారం రాత్రి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆ మేరకు తాంబరం పోలీసు కమిషనర్‌గా అబిన్‌ దినేష్‌ మోదక్‌ నియమితులయ్యారు.

- తాంబరం కమిషనర్‌గా అబిన్‌ దినేష్‌ మోదక్‌

చెన్నై: రాష్ట్ర ప్రభుత్వం 18 మంది ఐపీఎస్‌ అధికారులను(IPS officers) బదిలీ చేస్తూ మంగళవారం రాత్రి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆ మేరకు తాంబరం పోలీసు కమిషనర్‌గా అబిన్‌ దినేష్‌ మోదక్‌ నియమితులయ్యారు. తాంబరం పోలీసు కమిషనర్‌గా పనిచేసిన డాక్టర్‌ ఎ.అమల్‌ రాజ్‌ను చెన్నై సీఐడీ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరోకు బదిలీ చేసింది. స్టేట్‌ క్రైం రికార్డ్స్‌ బ్యూరో డీజీపీ అబిన్‌ దినేష్‌ మోదక్‌ను తాంబరం పోలీసు కమిషనర్‌గా, చెన్నై సాయుధదళం ఏడీజీపీ హెచ్‌ఎం జయరామ్‌ స్టేట్‌ క్రైం రికార్డ్స్‌ బ్యూరోకు బదలీ అయ్యారు. వేకన్సీ రిజర్వులో ఉన్న మహే్‌షకుమార్‌ అగర్వాల్‌ చెన్నై సాయుధ దళం ఏడీజీపీగా, చెన్నై క్రైం బ్రాంచ్‌(Chennai Crime Branch) సీఐడీ ఏడీజీపీ జి.వెంకటరామన్‌ హెచ్‌ఓపీఎ్‌ఫ అడ్మినిస్ట్రేషన్‌ ఏడీజీపీగా., అడ్మినిస్ట్రేషన్‌ ఏడీజీపీ వినిత్‌ దేవ్‌ వాఖండే పోలీసు హెడ్‌క్వార్టర్స్‌ ఏడీజీపీగా బదలీ అయ్యారు. చెన్నై క్రైంబ్రాంచ్‌ సీఐడీలో పనిచేస్తున్న ఐజీ టీఎస్‌ అన్బును ఆ విభాగానికి పూర్తి స్థాయి ఏడీజీపీగా నియమితులయ్యారు.

ఇదికూడా చదవండి: సికింద్రాబాద్‌ నుంచి ‘దివ్య జ్యోతిర్లింగ దర్శనయాత్ర’ రైలు..


చెన్నై సైబర్‌ క్రైం ఏడీజీపీని సముద్రతీర భద్రతాదళం ఏడీజీపీగా బదలీ చేశారు.. సముద్రతీర భద్రతాదళం ఏడీజీపీగా ఉన్న డాక్టర్‌ సందీప్‌ మిట్టల్‌ను చెన్నై సైబర్‌ క్రైం ఏడీజీపీగా బదిలీ చేశారు. వేకన్సీ రిజర్వులో ఉన్న రాజీవ్‌కుమార్‌ చెన్నైలోని మహిళలు, చిన్నారుల నేర నిరోధక విభాగం ఏడీజీపీగా, అక్కడ ఉన్న ఆర్‌.తమిల్‌ చంద్రన్‌ పోలీసు టెక్నికల్‌ సర్వీసెస్‌ ఏడీజీపీగా బదిలీ చేశారు. గ్రేటర్‌ చెన్నై సౌత్‌ శాంతి భద్రతల విభాగం ఐజీ ప్రేమ్‌ ఆనంద్‌ సిన్హా మదురై సౌత్‌ జోన్‌ ఐజీగా, ఆ పోస్టులో ఉన్న డాక్టర్‌ ఎన్‌ కన్నన్‌ గ్రేటర్‌ చెన్నై సౌత్‌ శాంతి భద్రతల విభాగం ఐజీగా నియమితులయ్యారు. చెన్నై నార్త్‌ శాంతి భద్రతల విభాగం ఐజీ అస్రా గార్డ్‌ చెన్నై నార్త్‌ జోన్‌ ఐజీగా, ప్రస్తుతం నార్త్‌జోన్‌ ఐజీగా ఉన్న కేఎస్‌ నరేంద్రన్‌ నాయర్‌ చెన్నై నార్త్‌ శాంతి భద్రతల విభాగం ఐజీగా బదిలీ అయ్యారు. తిరుప్పూరు న పోలీసుకమిషనర్‌ ప్రవీణ్‌కుమార్‌, సేలం నగర పోలీసు కమిషనర్‌గా ,ప్రస్తుత కమిషనర్‌ బి.విజయకుమారిని చెన్నై సాయుధ దళం ఐజీగా బదిలీ చేశారు. చెన్నై సాయుధ దళం ఐజీ ఎస్‌ లక్ష్మి తిరుప్పూరు నగర పోలీసు కమిషనర్గఆ బదిలీ అయ్యారు.


ఇదికూడా చదవండి: మీపై ఫెమా కేసు.. అరెస్ట్‌ తప్పదంటూ బెదిరింపులు

Read Latest Telangana News and National News

Read Latest AP News and Telugu News

Updated Date - Jul 10 , 2024 | 11:14 AM

Advertising
Advertising
<