Eknath Shinde: షిండే అలక వెనుక కారణం ఇదే
ABN, Publish Date - Nov 30 , 2024 | 04:02 PM
డిసెంబర్ 5న ముంబైలో ప్రమాణ స్వీకారం జరగవచ్చని ప్రచారం జరుగుతుండగా, ఏక్‌నాథ్ షిండే సతారా జిల్లాలోని తన స్వగ్రామానికి వెళ్లిపోవడంతో ఆయన అగ్రహంతో ఉన్నారనే సంకేతాలు వెలువడుతున్నాయి. షిండే మనసులో ఏముందనే చర్చ జరుగుతోంది.
ముంబై: 'మహాయుతి' కూటమి సీఎం అభ్యర్థి విషయంలో తలెత్తిన ప్రతిష్టంభన తొలిగిందని అంతా అనుకుంటున్న తరుణంలో అధికారిక ప్రకటన, కొత్త ప్రభుత్వం ఏర్పాటు తేదీపై సస్పెన్స్ కొనసాగుతోంది. డిసెంబర్ 5న ముంబైలో ప్రమాణ స్వీకారం జరగవచ్చని ప్రచారం జరుగుతుండగా, ఏక్‌నాథ్ షిండే సతారా జిల్లాలోని తన స్వగ్రామానికి వెళ్లిపోవడంతో ఆయన అగ్రహంతో ఉన్నారనే సంకేతాలు వెలువడుతున్నాయి. షిండే మనసులో ఏముందనే చర్చ జరుగుతోంది. కొత్త ప్రభుత్వంలో కీలకమైన హోం శాఖను ఆయన గట్టిగా కోరుకుంటున్నారని, ఈ విషయంలోనే ప్రభుత్వం ఏర్పాటులో జాప్యం జరుగుతోందని తెలుస్తోంది. గత ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా ఉన్న దేవేంద్ర ఫడ్నవిస్ చేతిలో హోం శాఖ ఉండేది.
Maharashtra Politics: మహారాష్ట్ర ప్రభుత్వ ఏర్పాటులో ఉత్కంఠ.. ఏక్‌నాథ్ షిండే కీలక నిర్ణయం తీసుకుంటారా..
షిండే ప్రాధాన్యతను తగ్గించే ప్రయత్నం?
కాగా, కొత్త ప్రభుత్వంలో శివసేనకు తప్పనిసరిగా హోం శాఖ ఇవ్వాల్సిందేనని శివసేన నేత సంజయ్ శిర్‌సత్ శనివారంనాడు పేర్కొన్నాడు. షిండే ప్రాధాన్యతను తగ్గించే ప్రయత్నం జరుగుతోందన్న అభిప్రాయం వ్యక్తం చేశారు. షిండేకు ఉన్ పాజిటివ్ ఇమేజ్, ఆయన ప్రవేశపెట్టిన పథకాలను దృష్టిలో ఉంచుకుంటే ముఖ్యమంత్రిగా ఆయన మరో రెండున్నరేళ్లు కొనసాగి ఉంటే మరింత ప్రయోజనాలు చేకూరేవని అన్నారు. శివసేనతోనే హోం శాఖ ఉండాల్సిందేనని అన్నారు. సహజంగానే ఆ శాఖ ఉప ముఖ్యమంత్రి చేతిలో ఉంటుందని, ముఖ్యమంత్రే హోం శాఖను తన చేతిలో ఉంచుకోవడం సరికాదని ఆయన వ్యాఖ్యానించారు.
సంక్షేమ పథకాలకు కొత్త రూపు
గతంలోనూ సంక్షేమ పథకాలు ఉన్నప్పటికీ షిండే వాటికి కొత్తరూపు ఇచ్చారని శిర్‌సత్ చెప్పారు. మహిళల కోసం రూపొందించిన ముఖ్యమంత్రి మాజి లడ్కీ బహిన్ పథకాన్ని ఎన్‌సీపీ చీఫ్ అజిత్ పవార్ వ్యతిరేకించారని, అయితే ప్రభుత్వం ఆ పథకాన్ని ముందుకు తీసుకువెళ్లిందని ఆయన ఆరోపించారు. ఆ పథకం ఫలితాలు ఎన్నికల్లో అంతా చూశామని చెప్పారు. ముఖ్యమంత్రిగా షిండే ఒక సాధారణ వ్యక్తిలా ఉండటాన్ని ప్రజలు ఆమోదించారని, అందుకు అనుగుణంగానే ఎన్నికల ఫలితాలు వచ్చాయని చెప్పారు.
ఇవి కూడా చదవండి
Special trains: క్రిస్మస్, న్యూ ఇయర్ సందర్భంగా ఊటీకి ప్రత్యేక రైళ్లు
Suburban trains: ఇక.. సబర్బన్ రైళ్లకు ఏసీ బోగీలు
Read More National News and Latest Telugu News
Updated Date - Nov 30 , 2024 | 04:02 PM