Elections: దేవేంద్ర ఫడ్నవీస్‌కు భద్రత పెంపు.. సెటైర్లతో ఆటాడుకున్న సంజయ్ రౌత్

ABN, Publish Date - Nov 03 , 2024 | 05:47 PM

మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, హోంమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌కు భద్రత పెంచారు. దీంతో ఉద్ధవ్ ఠాక్రే వర్గానికి చెందిన శివసేన నాయకుడు సంజయ్ రౌత్ దేవేంద్ర ఫడ్నవీస్‌ను టార్గెట్ చేశారు. ఫడ్నవీస్ రాష్ట్రానికి హోం మంత్రిగా ఉన్నారని, అకస్మాత్తుగా తన సొంత భద్రతా ఏర్పాట్లను పెంచుకుంటున్నారని సంజయ్ రౌత్ ఎద్దెవా చేశారు. హోం మంత్రి ఇతరులకు భద్రత కల్పిస్తారు. కానీ ఈ హోం మంత్రి తన భద్రతను పెంచుకుంటున్నారని..

Elections: దేవేంద్ర ఫడ్నవీస్‌కు భద్రత పెంపు.. సెటైర్లతో ఆటాడుకున్న సంజయ్ రౌత్

మహారాష్ట్రలో ఎన్నికల వాతావరణం రోజురోజుకు వేడెక్కుతోంది. పోలింగ్ సమయం దగ్గరపడుతున్న కొద్దీ పార్టీల మధ్య విమర్శలు, ప్రతి విమర్శల దాడి పెరుగుతోంది. మహాయుతి, మహా వికాస్ అఘాడీ మధ్య పోటీ ఉత్కంఠ రేపుతున్న నేపథ్యంలో.. విజయం కోసం రెండు కూటములు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. మరోవైపు అసెంబ్లీ ఎన్నికలకు ముందు మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, హోంమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌కు భద్రత పెంచారు. దీంతో ఉద్ధవ్ ఠాక్రే వర్గానికి చెందిన శివసేన నాయకుడు సంజయ్ రౌత్ దేవేంద్ర ఫడ్నవీస్‌ను టార్గెట్ చేశారు. ఫడ్నవీస్ రాష్ట్రానికి హోం మంత్రిగా ఉన్నారని, అకస్మాత్తుగా తన సొంత భద్రతా ఏర్పాట్లను పెంచుకుంటున్నారని సంజయ్ రౌత్ ఎద్దెవా చేశారు. హోం మంత్రి ఇతరులకు భద్రత కల్పిస్తారు. కానీ ఈ హోం మంత్రి తన భద్రతను పెంచుకుంటున్నారని విమర్శించారు. ఇదే అంశంపై సంజయ్ రౌత్ మాట్లాడుతూ.. ఫడ్నవీస్ ఇంటి బయట భారీగా భద్రతా బలగాలు మోహరించాయన్నారు. నాగ్‌పూర్‌లోని ఫడ్నవీస్ ఇంటి బయట 200 మంది కమాండోలు ఉన్నారని, ఎక్కడికి వెళ్లినా ఆయన చుట్టూ కమాండోలు ఉంటున్నారంటూ.. రాష్ట్ర హోంమంత్రి ప్రాణాలకు ముప్పు ఉందా అంటూ అనుమానం వ్యక్తం చేశారు.

Hemant Soren: మేము గెలిస్తే నెలకు 7 కేజీల రేషన్, పింఛన్ పెంచుతాం


హోంమంత్రికి భయం ఎందుకు..?

శివసేన (ఉద్ధవ్ వర్గం) నాయకుడు సంజయ్ రౌత్ మాట్లాడుతూ మహారాష్ట్ర హోంమంత్రి ఎందుకు భయపడుతున్నారు. ఎవరు అతనిపై దాడి చేయాలనుకుంటున్నారు. ఇది ఎవరి కుట్ర అని ప్రశ్నించారు. హఠాత్తుగా ఏం జరిగింది ఇజ్రాయెల్ వారిపై దాడి చేయబోతోందా.. లిబియా దాడి చేయబోతోందా. ఉక్రెయిన్ వారితో యుద్ధం చేయబోతుందా.. ఈ విషయాన్ని డీజీ రష్మీ శుక్లా చెప్పాలంటూ సంజయ్ రౌత్ ప్రశ్నించారు.

Kerala: రైల్వే ట్రాక్‌పై విషాదం.. నలుగురు మృతి


దేవేంద్ర ఫడ్నవీస్‌కు భద్రత పెంపు

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఉప ముఖ్యమంత్రి, బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్ భద్రతను పెంచారు. మహారాష్ట్ర పోలీస్ స్పెషల్ సెక్యూరిటీ యూనిట్ జడ్ ప్లస్ కేటగిరీ కింద అతనికి భద్రతను అందజేస్తుంది. అయితే ఎన్నికలకు ముందు ఆయన భద్రతను అకస్మాత్తుగా పెంచారు. దేవేంద్ర ఫడ్నవీస్‌కు భద్రతను పెంచడంపై ముంబై పోలీసు సీనియర్ అధికారి ఒకరు మాట్లాడుతూ.. నిఘా వర్గాల సమాచారంతోనే పోలీసులు ఈ నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. డిప్యూటీ సీఎం ఫడ్నవీస్ భద్రత కోసం నియమించిన సిబ్బందిలో మార్పులు చేసినట్లు తెలిపారు.

Delhi Air Pollution: 500 మార్క్ దాటిన ఢిల్లీ వాయు కాలుష్యం.. స్థానికుల భయాందోళన

మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Read More Latest Telugu News Click Here

Updated Date - Nov 03 , 2024 | 05:47 PM