ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

లద్దాఖ్‌లో మార్స్‌ వాతావరణం!

ABN, Publish Date - Nov 02 , 2024 | 04:46 AM

చంద్రుడు, అంగారకుడు లాంటి గ్రహాల్లోని వాతావరణాన్ని పోలిన పరిస్థితులను సృష్టించి, ఆ వాతావరణంలో వ్యోమగాములు ఎదుర్కొనే సవాళ్లను అధ్యయనం చేసేందుకు దేశంలోనే మొట్టమొదటి ‘అనలాగ్‌ స్పేస్‌ మిషన్‌’ను ఇస్రో శుక్రవారం ప్రారంభించింది.

  • అంతరిక్ష కార్యక్రమాల కోసం ఇస్రో

  • అనలాగ్‌ మిషన్‌.. దేశంలో ఇదే మొట్టమొదటిసారి

న్యూఢిల్లీ, నవంబరు 1: చంద్రుడు, అంగారకుడు లాంటి గ్రహాల్లోని వాతావరణాన్ని పోలిన పరిస్థితులను సృష్టించి, ఆ వాతావరణంలో వ్యోమగాములు ఎదుర్కొనే సవాళ్లను అధ్యయనం చేసేందుకు దేశంలోనే మొట్టమొదటి ‘అనలాగ్‌ స్పేస్‌ మిషన్‌’ను ఇస్రో శుక్రవారం ప్రారంభించింది. ఇందుకోసం లద్దాఖ్‌లోని లేహ్‌లో ఎత్తైన కొండ ప్రాంతాన్ని ఎంపిక చేసింది. లద్దాఖ్‌లో ఉండే ప్రత్యేకమైన, కఠినమైన వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో లేహ్‌ను ఈ మిషన్‌ కోసం ఎంచుకున్నారు. హ్యూమన్‌ స్పేస్‌ఫ్లైట్‌ సెంటర్‌, ఆకా స్పేస్‌ స్టూడియో, లద్దాఖ్‌ యూనివర్సిటీ, ఐఐటీ బాంబేతో కలిసి ఇస్రో ఈ మిషన్‌ను చేపట్టింది. దీనికి లద్దాఖ్‌ కొండ ప్రాంతాల అభివృద్ధి సంఘం కూడా మద్దతు తెలిపింది. లద్దాఖ్‌ మంచు ఎడారి. అక్కడ ఉష్ణోగ్రతలు ఎండా కాలంలో 3-35డిగ్రీలు, చలికాలంలో -20 నుంచి -35డిగ్రీలు ఉంటాయి. నాసా ప్రకారం.. అనలాగ్‌ మిషన్‌ అనేది ఒక ఫీల్డ్‌ టెస్టు. భూగ్రహాంతర వాతావరణ పరిస్థితుల్లో కొత్త సాంకేతికలు, రోబోటిక్‌ పరికరాలు, వాహనాలు, కమ్యూనికేషన్‌, విద్యుత్‌ వినియోగం ఇలా అంతరిక్ష యాత్రకు అవసరమైన అన్నింటిని పరీక్షిస్తారు. వాటిని పరిమితుల మేరకు ఎలా ఉపయోగించుకోవాన్నది దీని ద్వారా అంచనా వేస్తారు. వ్యోమగాములకు శిక్షణ ఇస్తారు.

Updated Date - Nov 02 , 2024 | 04:46 AM