ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Bangalore : ఐటీ ఉద్యోగికి రెండుసార్లు గుండెమార్పిడి

ABN, Publish Date - Jun 20 , 2024 | 05:53 AM

బెంగళూరు ఆస్టర్‌ ఆసుపత్రి వైద్యులు ఓ ఐటీ ఉద్యోగికి రెండుసార్లు గుండె మార్పిడి శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించారు.

విజయవంతంగా నిర్వహించిన బెంగళూరులో ఆస్టర్‌ వైద్యులు

బెంగళూరు, జూన్‌ 19(ఆంధ్రజ్యోతి): బెంగళూరు ఆస్టర్‌ ఆసుపత్రి వైద్యులు ఓ ఐటీ ఉద్యోగికి రెండుసార్లు గుండె మార్పిడి శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించారు. 2023 డిసెంబరు 31న రెండోసారి గుండె మార్పిడి ఆపరేషన్‌ చేయించుకున్న ఐటీ ఉద్యోగి వెంకటేశ్‌ సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నారని వైద్య నిపుణులు నాగమల్లేశ్‌ ప్రకటించారు. బెంగళూరు నగరంలో బుధవారం జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ఆయన ఐటీ ఉద్యోగిని మీడియాకు పరిచయం చేశారు. వైద్యులు నాగమల్లేశ్‌, దివాకర్‌ భట్‌ మాట్లాడుతూ, ‘2016లో ఐటీ ఉద్యోగికి డైలేటెడ్‌ కార్డియోమయోపతి లక్షణాలు కనిపించాయి. పలు ఆసుపత్రులు సందర్శించి, చివరకు ఆస్టర్‌ ఆసుపత్రికి వచ్చారు.


ఆయనకు గుండెమార్పిడి సర్జరీ చేశాం. ఆ తరువాత పూర్తిగా కోలుకుని సాధారణ జీవనం సాగించారు. 2018లో వివాహం చేసుకున్నారు. 2020లో కొవిడ్‌ సోకి ఇంటెన్సివ్‌కేర్‌లో చికిత్స పొందారు. 2023లో మరోసారి గుండె సమస్య తలెత్తింది. రక్తస్రావంతోపాటు ఇతరత్రా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వైద్య పరీక్షల ద్వారా గుండెమార్పిడి తప్పనిసరని నిర్ధారించాం. గత ఏడాది డిసెంబరు చివరి వారంలో ఆయన అడ్మిట్‌ అయ్యారు.


విజయవంతంగా గుండె మార్పిడి శస్త్ర చికిత్సను పూర్తి చేశాం. దేశంలో రెండుసార్లు గుండె మార్పిడి చేయించుకున్న వారిలో వెంకటేశ్‌ రెండోవారు. కర్ణాటకకు చెందిన వారు తొలి వ్యక్తి’ అని వివరించారు. వెంకటేశ్‌ మీడియాతో మాట్లాడుతూ, ‘తొలిసారి గుండె జబ్బును వారం రోజుల్లోనే తెలుసుకున్నా.


అప్పుడు గుండె మార్పిడికి నాటి ఏపీ ప్రభుత్వం ద్వారా అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు సీఎం రిలీ్‌ఫఫండ్‌ ద్వారా రూ.7 లక్షలు సాయం చేశారు. రెండోసారి ఆపరేషన్‌కు రూ.10 లక్షలకు దరఖాస్తు చేసుకున్నాం. ఇంకా నిధులు విడుదల కాలేదు. రెండోసారి ఆపరేషన్‌తో కొన్ని ఇబ్బందులు వచ్చాయి. ప్రస్తుతం ఆరోగ్యంగా ఉన్నా’ అని తెలిపారు. సమావేశంలో వైద్యులు గణేశ్‌ కృష్ణన్‌, మధుసూదన్‌ నారాయణ్‌, ప్రశాంత్‌, సీఈఓ రమేశ్‌ కుమార్‌ పాల్గొన్నారు.

Updated Date - Jun 20 , 2024 | 05:55 AM

Advertising
Advertising