ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

LK.Advani: ఇప్పటికే ఆలస్యం అయింది.. ఎల్ కే అద్వానీకి భారతరత్న ప్రకటనపై విపక్షాల స్పందన..

ABN, Publish Date - Feb 03 , 2024 | 04:41 PM

మాజీ ఉప ప్రధాని, రాజకీయ భీష్ముడు, బీజేపీ వ్యవస్థాపకుల్లో ఒకరైన ఎల్‌కే అద్వానీకి భారతరత్న ఇవ్వడంపై కాంగ్రెస్ స్పందించింది. కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే అన్నారు.

మాజీ ఉప ప్రధాని, రాజకీయ భీష్ముడు, బీజేపీ వ్యవస్థాపకుల్లో ఒకరైన ఎల్‌కే అద్వానీకి భారతరత్న ఇవ్వడంపై కాంగ్రెస్ స్పందించింది. కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే అన్నారు. అయితే.. బీజేపీ ఇప్పటికీ నిలబడి ఉందంటే అందుకు కారణం అద్వానీనేనని, కానీ ఆ వాస్తవాన్ని చాలా ఆలస్యంగా గుర్తించారని దిల్లీకి చెందిన కాంగ్రెస్ నేత సందీప్ దీక్షిత్ తెలిపారు. ప్రతిపక్షాలలో, శివసేన (ఉద్ధవ్ వర్గం) సైతం ఈ నిర్ణయాన్ని స్వాగతించింది. బాలాసాహెబ్ ఠాక్రే, సావర్కర్‌లకు ఇంకా భారతరత్న ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. ఎన్నికలు వచ్చినప్పుడే బీజేపీకి ఈ అవార్డులు గుర్తుకు వస్తాయని ఉద్ధవ్‌ వర్గం నేత ఆనంద్‌ దుబే అన్నారు.

తనకు భారతరత్న రావడంపై స్పందించిన ఎల్‌కే అద్వానీ ఎంతో వినయం, కృతజ్ఞతతో భారతరత్నను స్వీకరిస్తున్నట్లు ఒక ప్రకటన విడుదల చేశారు. "ఇది ఒక వ్యక్తిగా నాకు దక్కిన గౌరవం మాత్రమే కాదు, నా జీవితాంతం నా శక్తి మేరకు సేవ చేయడానికి నేను భద్రపరిచే ఆదర్శాలు, సూత్రాలకు కూడా గౌరవం" అని పేర్కొన్నారు. అద్వానీకి భారతరత్న రావడంపై అద్వానీ కుమారుడు జయంత్ అద్వానీ, కుమార్తె ప్రతిభా అద్వానీ సంతోషం వ్యక్తం చేశారు. " ఆయన చాలా పొంగిపోయారు. కళ్లు ఆనందభాష్పాలతో నిండిపోయాయి. రామ మందిరపు ప్రాణ ప్రతిష్ఠ సమయంలోనూ చాలా సంతోషంగా ఉందని అన్నారు.

మరిన్ని జాతీయం వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Feb 03 , 2024 | 04:41 PM

Advertising
Advertising