ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

ED: బీజేపీలో భయం మొదలు..? సునీత కేజ్రీవాల్‌‌తో కల్పన సోరెన్ భేటీపై ఆప్

ABN, Publish Date - Mar 31 , 2024 | 08:16 AM

లిక్కర్ స్కామ్‌లో ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. జార్ఖండ్‌లో ఓ భూ కుంభకోణం వ్యవహారంలో జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్‌ను కూడా అధికారులు అరెస్ట్ చేశారు. కొద్దిరోజుల వ్యవధిలో ఇద్దరు ముఖ్యమంత్రులను ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు.

ఢిల్లీ: లిక్కర్ స్కామ్‌లో (Liquor Scam) ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను (Aravind Kejriwal) ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. జార్ఖండ్‌లో ఓ భూ కుంభకోణం వ్యవహారంలో జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్‌ను (Hemant Soren) కూడా అధికారులు అరెస్ట్ చేశారు. కొద్దిరోజుల వ్యవధిలో ఇద్దరు ముఖ్యమంత్రులను ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు.

నేనున్నా..?

కేజ్రీవాల్‌ను ఈడీ అధికారులు అరెస్ట్ చేయడంతో సంఘీభావం తెలిపేందుకు శనివారం నాడు కల్పన సోరెన్ ఢిల్లీ (Delhi) వచ్చారు. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ సతీమణి సునీత కేజ్రీవాల్‌తో ప్రత్యేకంగా మాట్లాడారు. కేజ్రీవాల్ అరెస్ట్ గురించి వారిద్దరూ మాట్లాడారు. వారిద్దరి భేటీ తర్వాత సోషల్ మీడియా ఎక్స్‌లో ఫొటోలను ఢిల్లీ మంత్రి అతిషి షేర్ చేశారు. ఆ ఇద్దరు శక్తిమంతమైన మహిళలను చూసి బీజేపీ భయపడుతోందని రాసుకొచ్చారు.

గ్రేట్

‘ఆ ఇద్దరు మహిళలు గ్రేట్. దర్యాప్తు సంస్థలతో కేంద్ర ప్రభుత్వం వారి భర్తలను అరెస్ట్ చేసింది. ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నికైన ప్రభుత్వాలకు నాయకత్వం వహిస్తోన్న నేతల అరెస్ట్ దారుణం. ఇద్దరు మహిళల సమావేవం వీడియో చూసి బీజేపీలో భయం మొదలైంది. ఆ ఇద్దరు మహిళల ధైర్యానికి వందనం. ఇద్దరికి సెల్యూట్ చేస్తున్నా అని’ అతిషి స్పష్టం చేశారు.

బాధ్యత

‘కేజ్రీవాల్ సతీమణి సునీతతో మాట్లాడాను. భర్త అరెస్ట్ జరిగిన తర్వాత కుంగిపోవడం సహజం. సునీతలో ధైర్యం కల్పించేందుకు ఇక్కడికి వచ్చాను. ఓ స్నేహితురాలిగా అది తన బాధ్యత. దేశంలో లోక్ సభ ఎన్నికల షెడ్యూల్ వచ్చిన తర్వాత ఇద్దరు ముఖ్యమంత్రుల అరెస్ట్ చేయడం అత్యంత దారుణం. ప్రజాస్వామ్య దేశంలో ఇది సరికాదు. ఈ కఠిన సమయంలో కేజ్రీవాల్‌కు హేమంత్ సోరెన్ నేతృత్వంలోని జార్ఖండ్ రాష్ట్రం అండగా ఉంటుంది. చేయని తప్పుకు అధినేతలు తలవంచరు అని’ కల్పన సోరెన్ అభిప్రాయ పడ్డారు.

మరిన్ని లోక్ సభ ఎన్నికల వార్తల ఈ లింక్ క్లిక్ చేయండి.

ఇవి కూడా చదవండి:

Sumalatha: ఇంకా టిక్కెట్ ఇవ్వలేదు.. త్వరలోనే నిర్ణయం వెల్లడిస్తా.. సుమలత కామెంట్స్..

Reels: ఫ్లై ఓవర్ మీద కారు ఆపి రీల్స్.. ఆపై బ్యారికేడ్‌కు నిప్పు

Updated Date - Mar 31 , 2024 | 08:16 AM

Advertising
Advertising