ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Jairam Ramesh: ఈసీఐ వెబ్‌సైట్‌పై జైరామ్ రమేష్ సంచలన ఆరోపణ

ABN, Publish Date - Oct 08 , 2024 | 02:40 PM

హర్యానా అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ఓవైపు జరుగుతుండగా ట్రెండ్స్‌ను ఈసీఐ వెబ్‌సైట్ తప్పుదారి పట్టిస్తోందంటూ కాంగ్రెస్ సీనియర్ నేత జైరామ్ రమేష్ సంచలన ఆరోపణ చేశారు.

న్యూఢిల్లీ: హర్యానా అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ఓవైపు జరుగుతుండగా ట్రెండ్స్‌ను ఈసీఐ వెబ్‌సైట్ (ECI Website) తప్పుదారి పట్టిస్తోందంటూ కాంగ్రెస్ సీనియర్ నేత జైరామ్ రమేష్ (Jairam Ramesh) సంచలన ఆరోపణ చేశారు. అప్‌డేటెట్ ట్రెండ్స్‌ను చాలా నెమ్మదిగా అప్‌లోడ్ చేస్తోందని విమర్శించారు. పాతబడిన, తప్పుదారి పట్టించే సమాచారాన్ని షేర్ చేయాలని అధికార యంత్రాంగంపై బీజేపీ ఒత్తిడి తెచ్చేందుకు ప్రయత్నిస్తోందా? అని ప్రశ్నించారు.

PM Modi: గెలుపు దిశగా హర్యానా.. మోదీకి ఘనంగా స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు


''మరి కాసేపట్లో ఈసీకి మెమొరాండం సమర్పిస్తాం. ఫిర్యాదు చేస్తాం. మా ప్రశ్నలకు ఈసీ సమాధానం ఇస్తుందనే అనుకుంటున్నాం. 10-11 రౌండ్ల ఫలితాలు ఇప్పటికే బయటకు వచ్చాయి. కానీ 4-5 రౌండ్లనే ఈసీ వెబ్‌సైట్ అప్‌లోడ్ చేసింది. ఇది అధికార యంత్రాంగంపై ఒత్తిడి తెచ్చే ఎత్తుగడే'' అని జైరామ్ రమేష్ అన్నారు. అయితే అధైర్యపడాల్సిన పనిలేదని, ఆట పూర్తయినట్టు కాదని అన్నారు. ప్రజాతీర్పు కాంగ్రెస్‌కు అనుకూలంగానే వస్తుందని, ప్రభుత్వాన్ని తాము ఏర్పాటు చేయబోతున్నామని చెప్పారు.


ఈసీ స్పందన

కాగా, జైరామ్ రమేష్ చేసిన ఆరోపణలను ఈసీ తోసిపుచ్చింది. మీ ఆరోపణలు పూర్తిగా ఊహాజనితమని, బాధ్యతారహితంగా ఉన్నాయని పేర్కొంది. నిరాధార ఆరోపణలతో తప్పుదారి పట్టించవద్దని సమాధానమిచ్చింది.


For More National News and Telugu News..

Also Read:

ఖాతా తెరవని 'ఆప్'.. కాంగ్రెస్ ఓట్లకు గండి

Updated Date - Oct 08 , 2024 | 02:40 PM