ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Jammu Kashmir Assembly Elections: పొత్తుల్లేవు.. ఒంటరిగానే బరిలోకి.. కానీ..

ABN, Publish Date - Aug 18 , 2024 | 07:17 PM

ఆదివారం శ్రీనగర్‌లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో జమ్మూ కశ్మీర్ రాష్ట్ర బీజేపీ చీఫ్ రవీందర్ రైనా మాట్లాడారు. త్వరలో తొలి విడత అసెంబ్లీ అభ్యర్థుల జాబితాను విడుదల చేస్తామని ప్రకటించారు. మొత్తం అన్ని స్థానాల్లో అభ్యర్థులను బరిలో దింపుతామని ఆయన స్పష్టత ఇచ్చారు.

Jammu And Kashmir BJP Chief Ravinder Raina

శ్రీనగర్, ఆగస్ట్ 18: జమ్మూ కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలో తమ పార్టీ ఒంటరిగానే బరిలో దిగుతుందని ఆ రాష్ట్ర బీజేపీ చీఫ్ రవీందర్ రైనా స్పష్టం చేశారు. ఈ ఎన్నికల్లో బీజేపీ.. ఏ పార్టీతో పొత్తు పెట్టుకోదని ఆయన పేర్కొన్నారు. అయితే కాశ్మీర్ వ్యాలీలో 8 నుంచి 10 మంది స్వతంత్ర్య అభ్యర్థులు బరిలో దిగే అవకాశముందన్నారు. వారితో సంప్రదింపులు జరిపి పార్టీ గెలుపునకు బాటలు వేస్తామన్నారు.

Also Read: వైఎస్ భారతి కొత్త ప్లాన్ వర్కౌట్ అవుతుందా..?


ఆదివారం శ్రీనగర్‌లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో జమ్మూ కశ్మీర్ రాష్ట్ర బీజేపీ చీఫ్ రవీందర్ రైనా మాట్లాడారు. త్వరలో తొలి విడత అసెంబ్లీ అభ్యర్థుల జాబితాను విడుదల చేస్తామని ప్రకటించారు. మొత్తం అన్ని స్థానాల్లో అభ్యర్థులను బరిలో దింపుతామని ఆయన స్పష్టత ఇచ్చారు. ఈ ఎన్నికల్లో తమ పార్టీ భారీ మెజార్టీతో గెలుస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. అలాగే కేంద్రపాలిత ప్రాంతం జమ్మూ కశ్మీర్‌లో తమ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు.

Also Read: శ్రీవారి ఆలయ ఫైల్స్ కే రక్షణ లేకపోతే ఎలా?


ఇక పార్టీలో పీడీపీ మాజీ నేత, మాజీ మంత్రి చౌదరి జుల్పీకార్ అలీ పార్టీలో చేరడంతో బీజేపీకి అదనపు బలం వచ్చినట్లు అయిందన్నారు. అలీ రాకతో రాజౌరీ - పూంజ్ ప్రాంతంలో బీజేపీ బలపడుతుందని చెప్పారు. మరోవైపు ఆర్టికల్ 370పై నేషలిస్ట కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా చేసిన వ్యాఖ్యలను ఈ సందర్బంగా రవీందర్ రైనా ఖండించారు. జమ్మూ కశ్మీర్‌లో నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ తన ప్రాభవాన్ని కోల్పోయిందని విమర్శించారు. అందుకే ఆ పార్టీ నేత ఈ తరహా వ్యాఖ్యలు చేస్తున్నారని రవీందర్ రైనా ఆగ్రహం వ్యక్తం చేశారు.

Also Read: TMC MP: వివాదంలో చిక్కుకున్న సినీ నటి రచనా


జమ్మూ కశ్మీర్ అసెంబ్లీలో మొత్తం 90 ఎమ్మెల్యే స్థానాలున్నాయి. ఈ అసెంబ్లీకి మొత్తం మూడు దశల్లో ఎన్నికల పోలింగ్ జరగనుంది. ఎన్నికల ఫలితాలు ఆక్టోబర్ 4వ తేదీన వెలువడనున్నాయి. ఆర్టికల్ 370 రద్దు అనంతరం తొలిసారిగా జరుగుతున్న ఎన్నికలు ఇవి. ఈ నేపథ్యంలో ఈ ఎన్నికల్లో గెలుపు కోసం అటు కాంగ్రెస్, ఇటు బీజేపీతోపాటు ప్రాంతీయ పార్టీలు పీడీపీ, నేషనల్ కాన్ఫరెన్స్, పాంథర్స్.. తదితర పార్టీలు ఈ ఎన్నికల్లో గెలుపునకు తమదైన శైలిలో వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నాయి.

Also Read: Mohanlal: అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన మోహన్‌లాల్


మరోవైపు ఈ ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగా బరిలో దిగతుంది. అలాగే కాంగ్రెస్ సైతం ఒంటరిగా బరిలో దిగనుందని సమాచారం. అలా కాకుంటే.. ఇండియా కూటమిలోని భాగస్వామ్య పక్షాలతో కలిసి కాంగ్రెస్ పార్టీ.. ఈ ఎన్నికలకు వెళ్లే అవకాశం సైతం ఉందనే ఓ ప్రచారం సైతం సాగుతుంది. ఏదీ ఏమైనా ఈ అంశంపై ఒకటి రెండు రోజుల్లో ఓ స్పష్టత వచ్చే అవకాశం ఉందనేది మాత్రం సుస్పష్టం.

Also Read: Bengaluru Student: పార్టీ నుంచి ఇంటికి వెళ్తున్న యువతిపై దారుణం..

Read More National News and Latest Telugu News

Updated Date - Aug 18 , 2024 | 07:22 PM

Advertising
Advertising
<