ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

West Bengal: మమత ప్రభుత్వంలో ‘అవినీతి’పై మాజీ ఎంపీ ఆరోపణలు

ABN, Publish Date - Sep 10 , 2024 | 02:55 PM

కోల్‌కతాలోని ఆర్ జీ కర్ మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో ట్రైయినీ వైద్యురాలిపై హత్యాచార ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ హత్యాచార ఘటన అనంతరం రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచే ఆర్ జీ కర్ మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో జరుగుతున్న అవినీతిపై ఆరోపణలు వెల్లువెత్తాయి.

కోల్‌కతా, సెప్టెంబర్ 10: కోల్‌కతాలోని ఆర్ జీ కర్ మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో ట్రైయినీ వైద్యురాలిపై హత్యాచార ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ హత్యాచార ఘటన అనంతరం రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచే ఆర్ జీ కర్ మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో జరుగుతున్న అవినీతిపై ఆరోపణలు వెల్లువెత్తాయి.

అలాంటి వేళ మమతా బెనర్జీ ప్రభుత్వంలోని ఆరోగ్య శాఖలో చోటు చేసుకొంటున్న పరిణామాలపై తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నేత, రాజ్యసభ మాజీ సభ్యుడు జవహర్ సిర్కార్ కీలక వ్యాఖ్యలు చేశారు. మంగళవారం, కోల్‌కతాలో ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాజీ ఎంపీ జవహర్ సిర్కార్ మాట్లాడుతూ.. ఆరోగ్య శాఖలో తీసుకుంటున్న కీలక నిర్ణయాలపై అవినీతి అధికారులు ప్రభావం తీవ్రంగా ఉందన్నారు.

Kolkata doctor's mother: సీఎం మమత వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించిన హత్యాచార వైద్యురాలి తల్లి


ఈ ఆరోగ్య శాఖలో బదిలీలు, పోస్టింగులు, నియామకాలు ఇతరత్ర అంశాలన్నీ ‘ఉత్తర బెంగాల్ వైద్య బృందం’ కనుసన్నల్లోనే జరుగుతుందని ఆయన ఆరోపించారు. గతంలో ఈ అంశంపై ఆరోపణలు వెల్లువెత్తాయని గుర్తు చేశారు. ఆ ఆరోపణలు.. తన పరిశీలనలో నిజమని స్పష్టమైందని జవహర్ సిర్కార్ స్పష్టం చేశారు. ఈ తరహా ఘటనలు నేరం కానప్పటికీ.. పాలనపై మాత్రం గణనీయమైన ప్రభావం చూపిస్తాయన్నారు.

Ganesh Chaturthi: తొలి రోజే ఈ ‘గణపతి’రికార్డు


ఇదే తరహా ఘటనలు దేశవ్యాప్తంగా చోటు చేసుకున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అందుకు గుజరాత్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో చోటు చేసుకున్న పరిణామాలను ఈ సందర్భంగా ఆయన సోదాహరణతో వివరించారు. ఇక మెడికాల్ కాలేజీ ఆసుపత్రిలో ట్రైయినీ వైద్యురాలి హత్యాచార ఘటన అనంతరం ఆ కాలేజీ ప్రిన్సిపల్ ప్రొ. సందీప్ ఘోష్‌ను మమతా బెనర్జీ ప్రభుత్వం సస్పెండ్ చేయ లేదన్నారు.

Rahul Gandhi: యూఎస్ పర్యటనలో మళ్లీ కీలక వ్యాఖ్యలు


కానీ వైద్యురాలి హత్యాచార ఘటన చోటు చేసుకున్న మరునాడే ఆయన ప్రిన్సిపాల్ పదవికి రాజీనామా చేశారన్నారు. అనంతరం ఆయనకు బహుమతిగా మరో మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్‌గా మమతా బెనర్జీ ప్రభుత్వం నియమించిందని ఈ సందర్బంగా సిర్కార్ గుర్తు చేశారు. ఇదే అంశంపై కోల్‌కతా హైకోర్టు సైతం స్పందించిందన్నారు. ఈ హత్యాచార ఘటన అనంతరం తాను సైతం ప్రొ. సందీప్ ఘోష్‌పై సస్పెన్షన్ వేటు వేయాలని పార్టీని కోరినట్లు తెలిపారు. కానీ తన మాటలను తృణమూల్ కాంగ్రెస్ పార్టీ పెడచెవిన పెట్టిందన్నారు.

Ganesh Chaturthi: లంబోదరుడికి భారీ లడ్డూ.. ఎన్ని కేజీలంటే..?


ఆర్ జీ కర్ మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో ట్రయినీ వైద్యురాలిపై హత్యాచార ఘటన అనంతరం చోటు చేసుకున్న పరిణామాలు, మమతా బెనర్జీ ప్రభుత్వం వ్యవహరించిన తీరుకు నిరసనగా రాజ్యసభ సభ్యత్వానికి జవహర్ సిర్కార్ రాజీనామా చేశారు. మూడేళ్ల క్రితం తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నుంచి సిర్కార్ రాజ్యసభకు ఎన్నికైన సంగతి తెలిసిందే.

Read More National News and Latest Telugu News Click Here

Updated Date - Sep 10 , 2024 | 04:00 PM

Advertising
Advertising