Jharkhand Cabinet Expansion: మంత్రులకు శాఖల కేటాయింపు.. కీలక శాఖలు మాత్రం ఆయన దగ్గరే..
ABN, Publish Date - Dec 06 , 2024 | 04:12 PM
కాంగ్రెస్‌కు చెందిన రాధాకృష్ణ కిషోర్‌కు నాలుగు శాఖల బాధ్యతలు అప్పటించారు. దీపికా పాండే, సుదివ్య సోను, ఇర్ఫాన్ అన్సారీలకు మూడేసి మంత్రిత్వ శాఖలను కేటాయించారు. హఫీజుల్ హసన్, యోగేంద్ర ప్రసాద్, చమ్రా లిండా, రాందాస్ సోరెన్, దీపక్ బిరువా, సంజయ్ ప్రసాద్ యాదవ్‌లకు..
జార్ఖండ్‌లో మంత్రులకు శాఖలను కేటాయించారు. ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ గరిష్టంగా 5 శాఖలను తన వద్దే పెట్టుకున్నారు. ఏ మంత్రికి కేటాయించని శాఖల బాధ్యతలను తన వద్దనే ఉంచుకున్నారు. హేమంత్ సోరెన్ మంత్రివర్గంలో మహిళా సంక్షేమ శాఖను ఎవరికీ కేటాయించలేదు. కాంగ్రెస్‌కు చెందిన రాధాకృష్ణ కిషోర్‌కు నాలుగు శాఖల బాధ్యతలు అప్పటించారు. దీపికా పాండే, సుదివ్య సోను, ఇర్ఫాన్ అన్సారీలకు మూడేసి మంత్రిత్వ శాఖలను కేటాయించారు. హఫీజుల్ హసన్, యోగేంద్ర ప్రసాద్, చమ్రా లిండా, రాందాస్ సోరెన్, దీపక్ బిరువా, సంజయ్ ప్రసాద్ యాదవ్‌లకు ఒక్కొక్కరికి రెండు శాఖలు కేటాయించారు. కాంగ్రెస్‌కి చెందిన శిల్పి నేహా టిర్కీకి ఓ శాఖ బాధ్యతలు అప్పగించారు.
హోం, ఆర్థిక శాఖలు ఎవరికంటే..
హోంశాఖను ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ తనవద్దనే పెట్టుకున్నారు. ఆర్థిక మంత్రిత్వ శాఖను మాత్రం కాంగ్రెస్‌కు చెందిన రాధాకృష్ణ కిశోర్‌కు అప్పగించారు. ఆర్థిక శాఖతో పాటు ప్రణాళిక, వాణిజ్య పన్నులు, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ బాధ్యతలు రాధాకృష్ణ కిశోర్‌కు అప్పగించారు. ఇర్ఫాన్ అన్సారీకి ఆరోగ్య, వైద్య విద్య, పౌర సరఫరాల శాఖలను అప్పగించారు. దీపికా పాండేకు గ్రామీణాభివృద్ధి, రూరల్ వర్క్స్, పంచాయతీ స్టేట్ డిపార్ట్‌మెంట్ బాధ్యతలు అప్పగించారు. శిల్పి నేహా టిర్కీకి వ్యవసాయం, సహకార శాఖ బాధ్యతలు అప్పగించారు. జేఎంఎం కోటా నుంచి మంత్రివర్గంలో ఉన్న దీపక్ బీరువాకు రవాణా, రెవెన్యూ, రిజిస్ట్రేషన్, భూ సంస్కరణల శాఖల బాధ్యతలు అప్పగించారు. విద్యాశాఖ మంత్రి బాధ్యతలు రాందాస్ సోరెన్‌కు కేటాయించారు. రిజిస్ట్రేషన్ శాఖ బాధ్యతలు రాందాస్ సోరెన్ నిర్వర్తిస్తారు.
చమ్ర లిండాకు ఎస్సీ-ఎస్టీ, ఓబీసీ సంక్షేమ శాఖ మంత్రిగా బాధ్యతలు అప్పగించారు. మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రిగా హఫీజుల్ అన్సారీ బాధ్యతలు చేపట్టనున్నారు. ఆయనకు నీటి వనరుల బాధ్యత కూడా అప్పగించారు. మున్సిపల్ డెవలప్‌మెంట్, క్రీడలు, యువజన సంక్షేమం, ఉన్నత, సాంకేతిక విద్యా శాఖల మంత్రిగా సుదివ్య కుమార్ సోను నియమితులయ్యారు. యోగేంద్ర ప్రసాద్‌కు తాగునీరు, పారిశుధ్య శాఖ మంత్రిగా బాధ్యతలు అప్పగించారు.
మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Read More Latest Telugu News Click Here
Updated Date - Dec 06 , 2024 | 05:06 PM