ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Jharkhand Elections: జేఎంఎం తొలి జాబితా... సీఎం దంపతుల పోటీ ఎక్కడినుంచంటే

ABN, Publish Date - Oct 23 , 2024 | 02:51 PM

బర్‌హైత్ (ఎస్‌టీ) నియోజకవర్గం సిట్టింగ్ ఎమ్మెల్యేగా హేమంత్ సోరెన్ ఉన్నారు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో ఈ నియోజకవర్గం నుంచి ఆయన బీజేపీ అభ్యర్థి సైమాన్ మాల్టేపై 25,740 ఓట్ల ఆధిక్యంతో గెలిచారు. గాండేయ్ నియోజకవర్గం ఉప ఎన్నికల్లో కల్పనా సోరెన్ బీజేపీ అభ్యర్థి దిలీప్ కుమార్ వర్మపై 27,149 ఓట్ల ఆధిక్యంతో గెలిచారు.

రాంచీ: జార్ఖాండ్ అసెంబ్లీ ఎన్నికల్లో (Jharkhand Assembly Elections) పోటీ చేసే అభ్యర్థుల తొలి జాబితాను జార్ఖాండ్ ముక్తి మోర్చా (JMM) బుధవారంనాడు విడుదల చేసింది. బర్‌హైత్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ (Hemant Soren), ఆయన భార్య కల్పనా సోరెన్ (Kalpana Soren) గాండేయ్ నియోజకవర్గం నుంచి పోటీలో ఉన్నారు. జార్ఖాండ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ నవంబర్ 13, నవంబర్ 20 తేదీల్లో రెండు విడతలుగా జరుగనుండగా, నవంబర్ 23న ఫలితాలు వెలువడతాయి.

Rahul Gandhi: ప్రియాంక ర్యాలీలో రాహుల్ ఏం చేశారో చూడండి..


బర్‌హైత్ (ఎస్‌టీ) నియోజకవర్గం సిట్టింగ్ ఎమ్మెల్యేగా హేమంత్ సోరెన్ ఉన్నారు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో ఈ నియోజకవర్గం నుంచి ఆయన బీజేపీ అభ్యర్థి సైమాన్ మాల్టేపై 25,740 ఓట్ల ఆధిక్యంతో గెలిచారు. గాండేయ్ నియోజకవర్గం ఉప ఎన్నికల్లో కల్పనా సోరెన్ బీజేపీ అభ్యర్థి దిలీప్ కుమార్ వర్మపై 27,149 ఓట్ల ఆధిక్యంతో గెలిచారు. జేఎంఎం ఎమ్మెల్యే సర్ఫరాజ్ అహ్మద్ రాజీనామాతో గాండేయ్ ఉప ఎన్నిక జరిగింది.


కాగా, జేఎంఎం తాజాగా విడుదల చేసిన 35 మంది అభ్యర్థుల్లో హేమంత్ సోరెన్ సోదరుడు బసంత్ సోరెన్ కూడా ఉన్నారు. ఆనయ డుంకా నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. నల నియోజకవర్గం నుంచి జార్ఖాండ్ అసెంబ్లీ స్పీకర్ మహతో పోటీ చేస్తున్నారు. గార్వా నియోజకవర్గం నుంచి మంత్రి నీలేష్ ఠాకూర్, గిరిదిహ్ నుంచి సోను సుదివ్య, డుమ్రి నుంచి బేబి దేవి పోటీలో ఉన్నారు. 2019లో హేమంత్ సోరెన్ డుంకా, బర్‌హైత్ నియోజకవర్గాల్లో పోటీచేసి రెండింట్లోనూ గెలవడంతో బర్‌హైత్‌ను తనవద్దే ఉంచుకుని డుంకా సీటును వదులుకున్నారు. ఆ సీటులో సీఎం సోదరుడు బసంత్ సోరెన్ పోటీ చేసి బీజేపీ అభ్యర్థి మరాండిపై 6,842 ఓట్ల ఆధిక్యంతో గెలిచారు.


ఇవి కూడా చదవండి..

Priyanka Gandhi: మీలో సొంత కుటుంబ సభ్యులను చూస్తున్నా.. వయనాడ్ సభలో ప్రియాంక ఎమోషనల్..

Priyanka Gandhi: తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ.. వయనాడ్‌లో ప్రియాంక నామినేషన్..

Read More National News and Latest Telugu News

Updated Date - Oct 23 , 2024 | 02:51 PM