ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Hemant Soren: మేము గెలిస్తే నెలకు 7 కేజీల రేషన్, పెన్షన్ పెంచుతాం

ABN, Publish Date - Nov 03 , 2024 | 12:42 PM

జార్ఖండ్‌లో ఎన్నికల టైం దగ్గర పడింది. ప్రధాన పార్టీల నేతలు ప్రజలను మభ్యపెట్టేందుకు భారీ వాగ్దానాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే జార్ఖండ్‌ ముఖ్యమంత్రి హేమంత్‌ సోరెన్‌ ఈరోజు కీలక హామీలను ప్రకటించారు. ఆ వివరాలేంటో ఇక్కడ చుద్దాం.

Jharkhand elections

జార్ఖండ్ (Jharkhand) అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా కొన్ని రోజులే సమయం ఉంది. దీంతో నేతలు ఓటర్లను ఆకట్టుకునేందుకు కీలక హామీలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్(Hemant Soren) కీలక ప్రకటనలు చేశారు. రాష్ట్రంలో మళ్లీ తమ ప్రభుత్వం ఏర్పడితే పీడీఎస్ కింద అందించే రేషన్ మొత్తాన్ని పెంచుతామని హామీ ఇచ్చారు. దీంతో పాటు పెన్షన్ మొత్తాన్ని పెంపు చేయడంతోపాటు మరికొన్ని హామీలు ప్రకటించారు. ప్రస్తుతం ప్రభుత్వం 5 కిలోల రేషన్ ఉచితంగా ఇస్తుండగా, దానిని 7 కిలోలకు పెంచుతామన్నారు. జార్ఖండ్‌లో జేఎంఎం నేతృత్వంలో ఇండియా అలయన్స్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే వీటిని అమలు చేస్తామని హేమంత్ ఆదివారం సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.


టార్గెట్ బీజేపీ

అంతేకాదు జార్ఖండ్‌లో బీజేపీ అధికారంలో ఉన్నప్పుడు 11 లక్షల మందికి రేషన్ కార్డులు రద్దు చేశారని జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ ఆరోపించారు. రేషన్‌కార్డుల రద్దు వల్ల జార్ఖండ్‌లో చాలా మంది గిరిజనులు, దళితులు ఆకలితో చనిపోయారని వ్యాఖ్యానించారు. బీజేపీ హయాంలో రాష్ట్రంలో గిరిజనులు, దళితులు ఆకలితో చనిపోవడం సర్వసాధారణమన్నారు. కానీ మా ప్రభుత్వంలో మాత్రం జార్ఖండ్ ప్రజలు రేషన్, పెన్షన్ పెంపు, మంచి పోషకాహారం పొందుతారని అభిప్రాయం వ్యక్తం చేశారు.


మహిళలకు రూ. 2500

ఇంకా మిగిలి ఉన్న వారిని కూడా పీడీఎస్‌లో చేర్చుతామని సోరెన్ చెప్పారు. ఇది కాకుండా మాయన్ సమ్మాన్ యోజన కింద మహిళలకు నెలకు రూ. 2500 ఇవ్వనున్నట్లు ప్రకటించారు. జార్ఖండ్‌లోని అంగన్‌వాడీ కేంద్రాల్లో మధ్యాహ్న భోజనంలో పిల్లలకు గుడ్లు, పండ్లు కూడా అందజేస్తామన్నారు. మా ప్రభుత్వం సామాజిక భద్రత విషయంలో అనేక చర్యలు తీసుకుందన్నారు. 40 లక్షలకు పైగా వృద్ధులు, ఒంటరి మహిళలు, వికలాంగులకు సామాజిక భద్రతా పెన్షన్‌తో అనుసంధానించడం. శ్రామిక వర్గానికి పెన్షన్ వయస్సు 60 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాలకు తగ్గించడం. 18-50 సంవత్సరాల వయస్సు గల మహిళలకు మైయా సమ్మాన్ యోజన వంటి అనేక పథకాలను అమలు చేసినట్లు గుర్తు చేశారు.


ఎన్నికలు ఎప్పుడంటే..

జార్ఖండ్‌లో రెండు దశల్లో నవంబర్ 13, 20 తేదీల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. కాగా నవంబర్ 23న కౌంటింగ్ జరగనుంది. మరి ప్రజలు ఏ పార్టీకి పట్టం కడతారో చూడాలి మరి. ఈ ఉచిత రేషన్ సహా పలు హామీలకు ప్రజలు ఆకర్షితులు అవుతారో లేదా తెలియాలంటే మాత్రం ఎన్నికల కౌంటింగ్ వరకు ఆగాల్సిందే. ఈ రాష్ట్రంలో రెండు దశల్లో ఎన్నికల ఓటింగ్ జరగనుంది.


ఇవి కూడా చదవండి:

No Cash Payments: పెట్రోల్ పంప్, సూపర్ మార్కెట్లలో నగదు చెల్లింపులు బంద్.. పోలీసుల ప్రకటన


Investment Tips: ఒకేసారి రూ. 12 లక్షలు పెట్టుబడి చేసి మరచిపోండి.. ఆ తర్వాత ఎంతవుతుందంటే..

Bank Holidays: నవంబర్ 2024లో బ్యాంక్ సెలవులు.. దాదాపు సగం రోజులు బంద్..

Penny Stock: లక్ష పెట్టుబడితో 4 నెలల్లోనే రూ. 670 కోట్లు.. దేశంలోనే ఖరీదైన స్టాక్‌గా రికార్డ్

Read More National News and Latest Telugu News

Updated Date - Nov 03 , 2024 | 05:51 PM