ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Jharkhand: అసెంబ్లీ ఎన్నికల వేళ సీఎంకు షాక్.. బీజేపీ గూటికి చంపయి సోరెన్..?

ABN, Publish Date - Aug 16 , 2024 | 08:33 PM

రాజకీయాల్లో ఎప్పుడేది జరుగుతుందో ఎవరూ చెప్పలేం. జార్ఖాండ్ అసెంబ్లీ ఎన్నికల వేళ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్‌ కు మాజీ ముఖ్యమంత్రి చంపయి సోరెన్ గుడ్‌బై చెప్పనున్నారంటూ పుకార్లు షికార్లు చేస్తున్నారు.బీజేపీ లీడర్లతో ప్రస్తుతం ఆయన సంప్రదింపులు జరపుతున్నారని, త్వరలోనే ఆయన కాషాయం కండువా కప్పుకోనున్నారని భోగట్టా.

రాంచీ: రాజకీయాల్లో ఎప్పుడేది జరుగుతుందో ఎవరూ చెప్పలేం. జార్ఖాండ్ (Jharkhand) అసెంబ్లీ ఎన్నికల వేళ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్‌ (Hemant Soren)కు మాజీ ముఖ్యమంత్రి చంపయి సోరెన్ (Champai Soren) గుడ్‌బై చెప్పనున్నారంటూ పుకార్లు షికార్లు చేస్తున్నారు. ప్రస్తుతం హేమంత్ సోరెన్ ప్రభుత్వంలో చంపయి సోరెన్ మంత్రిగా ఉన్నారు. బీజేపీ లీడర్లతో ప్రస్తుతం ఆయన సంప్రదింపులు జరపుతున్నారని, త్వరలోనే ఆయన కాషాయం కండువా కప్పుకోనున్నారని భోగట్టా. చంపయి సోరెన్‌తో పాటు జార్ఖాండ్ ముక్తి మోర్చా (JMM) ఎమ్మెల్యే లాబిన్ హెంబ్రోమ్ కూడా బీజేపీలో చేరవచ్చని తెలుస్తోంది. పలువురు జేఎంఎం ఎమ్మెల్యేలు సైతం హేమంత్ సోరెన్‌ను విడిచిపెట్టేందుకు సిద్ధంగా ఉన్నట్టు చెబుతున్నారు. జేఎంఎం నేతలు ఇప్పటికే కేంద్ర హోం మంత్రి అమిత్‌షాను కలుసుకునేందుకు ఢిల్లీకి వెళ్లినట్టు కూడా తెలుస్తోంది. అయితే, ఇటు జేఎంఎం కానీ, అటు బీజేపీ కానీ అధికారికంగా ఈ విషయాన్ని ఇంకా ధ్రువీకరించడం లేదు.

Rahul Citizenship: రాహుల్ గాంధీ పౌరసత్వంపై ఢిల్లీ హైకోర్టుకు సుబ్రహ్మణ్య స్వామి


అలా గద్దెనెక్కి, ఇలా దిగిపోయారు..

చంపయి సోరెన్ గత ఫిబ్రవరిలో హేమంత్ సోరెన్ స్థానంలో ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టారు. నాటకీయ పరిణామాల మధ్య ఐదు నెలల తర్వాత మళ్లీ హేమంత్ సీఎం పగ్గాలు తన చేతుల్లోకి తీసుకున్నారు. మనీలాండరింగ్ కేసులో హేమంత్ సోరెన్‌ను ఈడీ అరెస్టు కాకముందు చంపయి సోరెన్‌కు సీఎం పగ్గాలు అప్పగించారు. హైకోర్టు బెయిలు మంజూరు చేయడంతో జూన్ 28న హేమంత్ విడుదలయ్యారు. ఆ వెంటనే జేఎంఎం లెజిస్లేచర్ పార్టీ నేతగా హేమంత్ తిరిగి ఎన్నిక కావడం, చంపయి సోరెన్ రాజీనామా చేయడంతో హేమంత్ తిరిగి సీఎంగా బాధ్యతలు చేపట్టడం చకచకా జరిగిపోయాయి.


జార్ఖాండ్ టైగర్..

జార్ఖాండ్ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేయాలంటూ సుదీర్ఘ పోరాటం చేసిన గిరిజన నేతగా, జార్ఖాండ్ టైగర్‌గా 67 ఏళ్ల చంపయి సోరెన్‌కు పేరుంది. జేఎంఎం టిక్కెట్‌పై 1995, 2000, 2005, 2009, 2014, 2019ల్లో వరుసగా ఆయన గెలుపొందారు. కాగా, 81 మంది సభ్యుల జార్ఖాండ్ అసెంబ్లీకి ఈ ఏడాది నవంబర్-డిసెంబర్‌లలో ఎన్నికలు జరగాల్సి ఉన్నాయి.

Read More National News and Latest Telugu News

Updated Date - Aug 16 , 2024 | 08:35 PM

Advertising
Advertising
<