ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

వక్ఫ్‌ బిల్లు జేపీసీ భేటీ.. ప్రతిపక్షాల బహిష్కరణ

ABN, Publish Date - Oct 15 , 2024 | 04:14 AM

వక్ఫ్‌ సవరణ బిల్లుపై సోమవారం జరిగిన సంయుక్త పార్లమెంటరీ కమిటీ(జేపీసీ) సమావేశాన్ని ప్రతిపక్ష ఎంపీలు బహిష్కరించారు.

న్యూఢిల్లీ, అక్టోబర్‌ 14 (ఆంధ్రజ్యోతి): వక్ఫ్‌ సవరణ బిల్లుపై సోమవారం జరిగిన సంయుక్త పార్లమెంటరీ కమిటీ(జేపీసీ) సమావేశాన్ని ప్రతిపక్ష ఎంపీలు బహిష్కరించారు. ఈ కమిటీ నిబంధనలకు అనుగుణంగా పనిచేయడం లేదని వారు ఆరోపించారు. కమిటీ చైర్మన్‌, బీజేపీ ఎంపీ జగదంబికా పాల్‌ను తొలగించాలని డిమాండ్‌ చేశారు. తమ వాదనలు వినిపించేందుకు అవకాశం కల్పించాలని లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లాకు విజ్ఞప్తి చేశారు. వక్ఫ్‌ బిల్లుతో సంబంధం లేని అంశాలపై కర్ణాటక మైనారిటీస్‌ కమిషన్‌ మాజీ చైర్మన్‌ అన్వర్‌ మనిప్పడి తన ప్రజంటేషన్‌ ఇచ్చేందుకు జేపీసీ చైర్మన్‌ అనుమతించడంపై విపక్ష సభ్యులు అభ్యంతరం తెలిపారు. కర్ణాటకలో కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని, కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను విమర్శించేందుకు అన్వర్‌ ఈ అవకాశాన్ని వాడుకున్నారని తెలిపారు. తెలుగు రాష్ట్రాల నుంచి టీడీపీ ఎంపీ లావు కృష్ణ దేవరాయలు, బీజేపీ ఎంపీ డి.కె.అరుణ ఈ సమావేశంలో పాల్గొన్నారు.

Updated Date - Oct 15 , 2024 | 04:14 AM