ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

జమిలి దేశానికే ముప్పు: కమల్‌హాసన్‌

ABN, Publish Date - Sep 22 , 2024 | 03:51 AM

‘ఒకే దేశం ఒకే ఎన్నిక’ విధానం దేశానికే ముప్పు కలిగిస్తుందని ప్రముఖ సినీ నటుడు, ‘మక్కల్‌నీదిమయ్యం’ పార్టీ అధినేత కమల్‌హాసన్‌ పేర్కొన్నారు.

చెన్నై, సెప్టెంబరు 21 (ఆంధ్రజ్యోతి): ‘ఒకే దేశం ఒకే ఎన్నిక’ విధానం దేశానికే ముప్పు కలిగిస్తుందని ప్రముఖ సినీ నటుడు, ‘మక్కల్‌నీదిమయ్యం’ పార్టీ అధినేత కమల్‌హాసన్‌ పేర్కొన్నారు. శనివారం చెన్నైలో జరిగిన పార్టీ ద్వితీయ సర్వసభ్యమండలి సమావేశం కమల్‌కే మళ్లీ పగ్గాలు అప్పగిస్తూ తీర్మానం చేసింది. ఈ సందర్భంగా కమల్‌ మాట్లాడుతూ.. జమిలి ఎన్నికలు ఫెడరల్‌ రాజ్యాంగ విధానానికి వ్యతిరేకమని, ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు వంటిదని అభిప్రాయపడ్డారు. తమిళుడు ప్రధాని కావాలని ఆకాంక్షించారు. ఇదిలా ఉండగా పార్టీ బలోపేతానికి ప్రతి శాసనసభ నియోజకవర్గంలోనూ 5 వేల మందిని సభ్యులుగా చేర్చాలని పార్టీ తీర్మానం చేసింది.

Updated Date - Sep 22 , 2024 | 03:52 AM