Prajwal Revanna: ప్రజ్వల్ రేవణకు హైకోర్టులో చుక్కెదురు.. బెయిల్ నిరాకరణ
ABN, Publish Date - Oct 21 , 2024 | 06:07 PM
అత్యాచారం, లైంగిక దాడి కేసులో జనతాదళ్ సెక్యులర్ మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణకు కర్ణాటక హైకోర్టు లో సోమవారంనాడు ఎదురుదెబ్బ తగిలింది.
బెంగళూరు: అత్యాచారం, లైంగిక దాడి కేసులో జనతాదళ్ సెక్యులర్ (JDS) మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ (Prajwal Revanna)కు కర్ణాటక హైకోర్టు (Karnataka High Court)లో సోమవారంనాడు ఎదురుదెబ్బ తగిలింది. ఆయన దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్‌ను హైకోర్టు తోసిపుచ్చింది. దీనికి ముందు సెప్టెంబర్ 19న రేవణ్ణ బెయిలు పిటిషన్‌పై తీర్పును సింగిల్ బెంచ్ జడ్జి నాగప్రసన్న రిజర్వ్ చేశారు. లైంగిక వేధింపులు, అత్యాచారం ఆరోపణలపై రేవణ్ణపై మూడు కేసులు నమోదయ్యాయి.
India-China: సరిహద్దుల వివాదంలో కీలక పురోగతి.. భారత్-చైనా మధ్య ఒప్పందం
రేవణ్ణపై కేసుల నేపథ్యం
రేవణ్ణపై లైగింక వేధింపులు, అత్యాచారం కేసు గత ఏప్రిల్ 28న హసన్ జిల్లా హోలెనరసిపురలో నమోదైంది. ఏప్రిల్ 26న లోక్‌సభ ఎన్నికలకు ముందు ఒక వీడియో కూడా హల్‌చల్ చేయడంతో హసన్ నియోజకవర్గం నుంచి పోటీలో ఉన్న రేవణ్ణ ఏప్రిల్ 27న జర్మనీ పారిపోయారు. దీంతో ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్ ప్రత్యేక కోర్టు ఆయన అరెస్టుకు వారెంట్ జారీ చేసింది. ఇంటర్‌పోల్ సైతం బ్లూ కార్నర్ నోటీసు జారీ చేయడంతో రేవణ్ణ మే 31న జర్మనీ నుంచి తిరిగివచ్చారు. వెంటనే ఆయనను సిట్ అరెస్టు చేసింది. రేవణ్ణ తన ఇంట్లో గతంలో పనిచేసిన 47 ఏళ్ల మహిళపై లైంగిక వైధింపులకు పాల్పడ్డాడంటూ తొలి కేసు నమోదైంది. ఇందులో ఆయన పేరు రెండవ నిందితుడిగా ఉంది. ఆయన తండ్రి, స్థానిక ఎమ్మెల్యే హెచ్‌డీ రేవణ్ణ ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్నారు. ప్రజ్వల్ రేవణ్ణపై రెండోకేసును మే 1న సీఐడీ నమోదు చేసింది. హసన్ జిల్లా పంచాయతీ మాజీ సభ్యురాలు ఒకరు తనపై రేవణ్ణ పలుమార్లు అత్యాచారం జరిపారంటూ ఆరోపించడంపై ఈ కేసు నమోదైంది. మైసూరులోని కేఆర్ నగగరకు చెందిన మహిళపై హత్యాచారం చేశారంటూ రేవణ్ణపై మూడో కేసు కేఆర్‌నగర్ పోలీస్ స్టేషన్‌లో మే 2న నమోదైంది. లైంగిక వైధింపుల ఆరోపణలపైనే జూన్ 12 బెంగళూరు సీఐడీ అధికారులు జూన్ 12న నాలుగో కేసు సైతం నమోదు చేసారు.
Read More National News and Latest Telugu News
ఇది కూడా చదవండి..
CJI: అయోధ్య వివాద పరిష్కారం కోసం దేవుడ్ని ప్రార్థించా.. జస్టిస్ చంద్రచూడ్ ఆసక్తికర వ్యాఖ్యలు
Updated Date - Oct 21 , 2024 | 06:07 PM