Jammu and Kashmir: ఊపిరందక ఆరుగురి మృతి.. నలుగురికి తీవ్రగాయాలు
ABN, Publish Date - Dec 18 , 2024 | 10:00 AM
జమ్మూ కశ్మీర్‌లోని కథువా జిల్లాలో విషాధం చోటు చేసుకుంది. జిల్లాలో శివనగర్‌లోని ఓ ఇంట్లో బుధవారం తెల్లవారుజాము అగ్ని ప్రమాదం సంభవించింది. దీంతో ఆరుగురు మరణించారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు.
శ్రీనగర్, డిసెంబర్ 18: జమ్ము కాశ్మీర్‌లోని కథువా జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. శివనగర్ ప్రాంతంలో ఓ ఇంట్లో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఈ దుర్ఘటనలో ఆరుగురు మరణించారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో ఇద్దరు చిన్నారులు సైతం ఉన్నారని పోలీసులు వెల్లడించారు. బుధవారం తెల్లవారుజామున 2.30 గంటలకు ఇంట్లో నుంచి మంటలు రావడాన్ని గమనించారు. దీంతో వారు వెంటనే స్పందించి.. పోలీసులకు సమాచారం అందించారు.
Also Read: పీటల మీద ఆగిన ఐపీఎస్ వివాహం... కార్యకర్తలు ఆందోళన
పోలీసులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకున్నారు. అనంతరం మంటలను ఆర్పి.. ఆ ఇంట్లోని వారిని కథువాలోని ప్రభుత్వ వైద్య కళాశాల ఆసుపత్రికి తరలించారు. ఆరుగురు మరణించారని వైద్యులు వెల్లడించారు. మరో నలుగురి పరిస్థితి విషమంగా ఉందని వారు తెలిపారు. అయితే అగ్ని ప్రమాదం కారణంగా.. వీరంతా ఊపిరాడక మరణించారని వారు చెప్పారు. ఇదే విషయం తమ ప్రాధమిక దర్యాప్తులో తేలిందని పోలీసులు వివరించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు వెల్లడించారు. నిద్రిస్తున్న సమయంలో ఈ అగ్ని ప్రమాదం చోటు చేసుకొని ఉంటుందని.. దీంతో వారంతా ఊపిరాడక మరణించి ఉంటారని పోలీసులు తెలిపారు. మరో వైపు ఈ ప్రమాదం షార్ట్ సర్క్యూట్ కారణంగా జరిగిందా? లేకుంటే ఉద్దేశ పూర్వకంగా జరిగిందా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అందులోభాగంగా ఆ ఇంటిని పోలీసులు పరిశీలించారు.
Also Read: ఏపీ మళ్లీ భారీ వర్షాలు..
ఇంకోవైపు కథువా ప్రభుత్వ మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ ఎస్ కే అత్రి మాట్లాడుతూ.. రిటైర్డ్అసిస్టెంట్ మేట్రన్ నివస్తున్న అద్దె ఇంట్లో మంటలు చెలరేగాయని చెప్పారు. ఈ ఘటనలో మొత్తం10 మందిని పోలీసులు ఆసుపత్రికి తీసుకు వచ్చారన్నారు. వారిలో ఆరుగురు అప్పటికే మరణించారని చెప్పారు. మరో నలుగురు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని వివరించారు. మృతుల్లో ఇద్దరు మైనర్లు ఉన్నారని పేర్కొన్నారు. ఈ మృతదేహాలకు పోస్ట్‌మార్టం నిర్వహించాల్సి ఉందన్నారు. అనంతరం వాటిని పోలీసులకు అందజేస్తామని వివరించారు.
For National News And Telugu News
Updated Date - Dec 18 , 2024 | 10:04 AM