ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Ayodhya Ram Temple: అయోధ్యకు కుటుంబ సమేతంగా వెళ్తున్న కేజ్రీవాల్, మాన్

ABN, Publish Date - Feb 11 , 2024 | 05:02 PM

అయోధ్యలో రామాలయాన్ని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ , పంజాబ్ సీఎం భగవత్ సింగ్ మాన్ ఈనెల 12వ తేదీ సోమవారంనాడు దర్శించనున్నారు. వీరు ఉభయులు తమ కుటుంబసభ్యులతో కలిసి అయోధ్య రామాలయాన్ని దర్శించనున్నట్టు పార్టీ వర్గాలు అదివారం తెలిపాయి.

న్యూఢిల్లీ: అయోధ్యలో రామాలయాన్ని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal), పంజాబ్ సీఎం భగవత్ సింగ్ మాన్ (Bhagwant Mann) ఈనెల 12వ తేదీ సోమవారంనాడు దర్శించనున్నారు. వీరు ఉభయులు తమ కుటుంబసభ్యులతో కలిసి అయోధ్య రామాలయాన్ని దర్శించనున్నట్టు పార్టీ వర్గాలు అదివారం తెలిపాయి. జనవరి 22న రామాలయ ప్రాణప్రతిష్ఠకు రావాలని అరవింద్ కేజ్రీవాల్‌కు ఆహ్వానం వచ్చినప్పటికీ, ఆయన తన భార్య, పిల్లలు, తల్లిదండ్రులతో కలిసి మరో రోజు హాజరయ్యేందుకు గతంలో నిర్ణయం తీసుకున్నారు.


కాగా, అయోధ్య రామాలయాన్ని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ ఆదివారం ఉదయం మరోమారు సందర్శించారు. సీఎం వెంట డిప్యూటీ ముఖ్యమంత్రులు కేశవ్ ప్రసాద్ మౌర్య, బ్రజేష్ పాఠక్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సైతం బాలక్ రామ్ దర్శనం చేసుకున్నారు. బస్సుల్లో వీరు అయోధ్యకు వెళ్లారు.

Updated Date - Feb 11 , 2024 | 05:02 PM

Advertising
Advertising