ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Arvind Kejriwal: అదే జరిగితే..20 రోజుల తర్వాత నేను తిరిగి జైలుకు వెళ్లనక్కర్లేదు..

ABN, Publish Date - May 12 , 2024 | 08:58 PM

ఎన్నికల ప్రచారం కోసం జూన్ 1వ తేదీ వరకూ మధ్యంతర బెయిలుపై జైలు నుంచి బయటకు వచ్చిన ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ దేశ రాజధానిలో రెండో రోజైన ఆదివారంనాడు కూడా రోడ్‌షో కొనసాగించారు. తమ పార్టీకి గరిష్టంగా ఓట్లు వేస్తే 20 రోజుల తర్వాత తాను జైలుకు తిరిగి వెళ్లక్కరలేదని అన్నారు.

న్యూఢిల్లీ: ఎన్నికల ప్రచారం కోసం జూన్ 1వ తేదీ వరకూ మధ్యంతర బెయిలుపై జైలు నుంచి బయటకు వచ్చిన ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) దేశ రాజధానిలో రెండో రోజైన ఆదివారంనాడు కూడా రోడ్‌షో కొనసాగించారు. తమ పార్టీకి గరిష్టంగా ఓట్లు వేస్తే 20 రోజుల తర్వాత తాను జైలుకు తిరిగి వెళ్లక్కరలేదని అన్నారు. ఇన్ని రోజులు ఢిల్లీ ప్రజలను తాను, తనను ఢిల్లీ ప్రజలకు మిస్ అయ్యారని, భగవంతుడు ఎట్టకేలకు తమను కలిపాడని, తనకు బెయిల్ వచ్చిందని చెప్పారు.


''ఈ వ్యక్తులు (బీజేపీ) 20 రోజుల తర్వాత నేను జైలుకు తిరిగి వెళ్లాలని చెబుతున్నారు. అయితే మీరు (ప్రజలు) పెద్దఎత్తున చీపురు (Jhaadu) బటన్‌‌ నొక్కితే నేను జైలుకు వెళ్లనక్కరలేదు. మీకు ఆ శక్తి ఉంది'' అని కేజ్రీవాల్ అన్నారు. మనీలాండరింగ్ కేసులో మార్చి 21న అరెస్టయిన కేజ్రీవాల్‌కు దాదాపు 50 రోజుల తర్వాత సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. జూన్ 1వ తేదీ వరకూ ప్రచారానికి అనుమతి ఇస్తూ జూన్ 2న దర్యాప్తు సంస్థలకు లొంగిపోవాలని షరతు విధించింది. ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు అనుమితిస్తూనే సీఎం కార్యాలయానికి, సచివాలయానికి వెళ్లరాదని, ఎల్జీ అనుమతి లేకుండా ఫైళ్లపై సంతకాలు చేయరాదని షరతులు విధించింది

Updated Date - May 12 , 2024 | 08:58 PM

Advertising
Advertising