ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ED: సీపీఎంకు బిగుస్తున్న ఉచ్చు.. మనీలాండరింగ్ కేసులో భూమి, బ్యాంకు డిపాజిట్లు సీజ్

ABN, Publish Date - Jun 29 , 2024 | 08:46 PM

ప్రతిపక్ష నేతలే టార్గెట్‌గా దర్యాప్తు సంస్థలు ఉచ్చు బిగుస్తున్న వేళ.. కేరళలో అధికారంలో ఉన్న సీపీఐకు భారీ షాక్ తగిలింది. కేరళలో(Kerala) సీపీఎంకు చెందిన భూమి, బ్యాంకు డిపాజిట్లను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ED) సీజ్ చేసింది.

తిరువనంతపురం: ప్రతిపక్ష నేతలే టార్గెట్‌గా దర్యాప్తు సంస్థలు ఉచ్చు బిగుస్తున్న వేళ.. కేరళలో అధికారంలో ఉన్న సీపీఐకు భారీ షాక్ తగిలింది. కేరళలో(Kerala) సీపీఎంకు చెందిన భూమి, బ్యాంకు డిపాజిట్లను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ED) సీజ్ చేసింది. కరువాన్నూర్ సర్వీస్ కోఆపరేటివ్ బ్యాంకు కుంభకోణంలో హవాలా లావాదేవీలు జరిగినట్లు ఈడీ దర్యాప్తు చేస్తోంది.

ఈ నేపథ్యంలో సీపీఐ (ఎం) భూమి, బ్యాంకు డిపాజిట్లు జప్తు చేశామని ఈడీ అధికారులు తెలిపారు. అయితే ఈ అంశంపై స్పందించిన సీపీఎం నేతలు.. హవాలా లావాదేవీలకు పాల్పడలేదని చెబుతోంది. ఆ పార్టీ ఆస్తులను హవాలా లావాదేవీల నిరోధక చట్టం (PMLA) కింద జప్తు చేశామని ఈడీ వర్గాలు తెలిపాయి.


త్రిసూర్ జిల్లాలో రూ.10 లక్షల విలువైన భూమి, సీపీఎంకు చెందినరూ.63 లక్షల బ్యాంకు డిపాజిట్లను జప్తు చేసింది. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) ఆరోపణలను పార్టీ ఖండించింది. ఈడీ దర్యాప్తు విషయమై పోరాడతామని సీపీఎం కేరళ రాష్ట్ర కార్యదర్శి గోవిందన్ పేర్కొన్నారు. రాజకీయ కారణాల రీత్యా విపక్ష నేతలను లక్ష్యంగా చేసుకోవడం ఈడీకి అలవాటుగా మారిందని విమర్శించారు. కేంద్ర దర్యాప్తు సంస్థ తమకు వ్యతిరేకంగా సాక్షాధారాలు సేకరించడంలో విఫలమైందన్నారు. న్యాయపోరాటానికి సిద్ధం కావాలని నేతలకు మార్గ నిర్దేశం చేశారు.

Latest Telugu News And National News

Updated Date - Jun 29 , 2024 | 08:46 PM

Advertising
Advertising