Viral Video: అయోధ్య రాముడిని దర్శించుకున్న గవర్నర్ మహ్మద్ ఖాన్.. సాష్టాంగ నమస్కారం చేసి పూజలు
ABN, Publish Date - May 09 , 2024 | 12:26 PM
లోక్ సభ ఎన్నికల్లో హిందూ, ముస్లిం అంటూ విభజన రాజకీయాలు చేస్తున్న నేతల నడుమ.. మత సామరస్యాన్ని చాటారు ఓ రాష్ట్ర గవర్నర్. అయోధ్య రాముడి గుడిని దర్శించుకుని నెటిజన్ల ప్రశంసలు అందుకుంటున్నారు.
అయోధ్య: లోక్ సభ ఎన్నికల్లో హిందూ, ముస్లిం అంటూ విభజన రాజకీయాలు చేస్తున్న నేతల నడుమ.. మత సామరస్యాన్ని చాటారు ఓ రాష్ట్ర గవర్నర్. అయోధ్య రాముడి గుడిని దర్శించుకుని నెటిజన్ల ప్రశంసలు అందుకుంటున్నారు.
కేరళ గవర్నర్ ఆరిఫ్ మహ్మాద్ ఖాన్(Arif Mohammad Khan) బుధవారం ఉదయాన్నే అయోధ్యకు(Ayodhya Ram Mandir) వెళ్లారు. అక్కడ రాముడి గుడిలోకి ప్రవేశించి సాష్టాంగ నమస్కారం చేశారు. అనంతరం భగవంతుడికి ప్రత్యేక పూజలు జరిపారు. అయోధ్య పర్యటన విశేషాలను ఆయన ఎక్స్‌లో పంచుకున్నారు.
‘‘జనవరిలో రెండుసార్లు అయోధ్యకు వచ్చాను. అప్పటి అనుభూతి ఈనాటికీ అలాగే ఉంది. చాలాసార్లు అయోధ్యకు వచ్చాను. రాములవారి గుడి దేశానికే గర్వకారణం. రాముడిని పూజించండి" అని గవర్నర్ అధికారిక ఎక్స్ హ్యాండిల్‌లో పోస్ట్ చేశారు.
ఆ పోస్ట్‌లో గవర్నర్ సాష్టాంగ నమస్కారం చేస్తున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. మతసామరస్యాన్ని చాటిన గవర్నర్‌పై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. "జై శ్రీ రాం" అంటూ కామెంట్లు చేస్తున్నారు.
ఇవీ చదవండి..
Lok Sabha Polls: యూపీలో పెరుగుతున్న పొలిటికల్ హీట్.. మాయవతి, అఖిలేష్ మధ్య మాటల యుద్ధం..
Lok Sabha Polls: స్మృతి ఇరానీని శర్మ ఓడిస్తారా.. అమేథిలో ఏం జరుగుతోంది..?
Read Latest News and National News click here..
Updated Date - May 09 , 2024 | 12:27 PM