ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Kerala landslides: కేరళకు తమిళనాడు ఆపన్న హస్తం.. రూ.5 కోట్ల సాయం, రెస్క్యూ టీమ్‌లు

ABN, Publish Date - Jul 30 , 2024 | 03:41 PM

కేరళలోని వయనాడ్ జిల్లాలో ప్రకృతి విలయం సంభవించి అనేక మంది సజీవసమాధి కావడం, పదుల సంఖ్యలో గాయపడటంపై తమిళనాడు సర్కార్ కేరళకు ఆపన్న హస్తం అందించింది. మూడు రెస్క్యూ టీమ్‌లను పంపడంతో పాటు రూ.5 కోట్లు సాయం అందించాలని నిర్ణయించింది.

చెన్నై: కేరళ (Kerala) లోని వయనాడ్ (Wayanad) జిల్లాలో ప్రకృతి విలయం సంభవించి అనేక మంది సజీవసమాధి కావడం, పదుల సంఖ్యలో గాయపడటంపై తమిళనాడు సర్కార్ కేరళకు ఆపన్న హస్తం అందించింది. అగ్నిమాపక, సహాయక సిబ్బంది, వైద్యులు, వైద్య సిబ్బంది, ఎస్‌డీఆర్‌ఎఫ్‌తో కూడిన మూడు టీమ్‌లను కేరళకు పంపాలని తమిళనాడు ప్రభుత్వం నిర్ణయించింది. రెస్క్యూ పనుల పర్యవేక్షణ కోసం ఇద్దరు సీనియర్ ఐఏఎస్ అధికారులు జి.సమీరన్, జానీ టామ్ వర్ఘేసేలను తక్షణం కేరళ బయలుదేరి వెళ్లాల్సిందిగా ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ (MK Stalin) ఆదేశించారు. సహాయక చర్యల కోసం సీఎం సహాయక నిధి నుంచి రూ.5 కోట్ల రూపాయలను కేరళకు అందించనున్నట్టు కూడా స్టాలిన్ ప్రకటించారు.

Wayanad landslides: వయనాడ్‌ను ఆదుకోండి... కేంద్రాన్ని కోరిన రాహుల్ గాంధీ


కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌తో స్టాలిన్ ఫోన్‌లో మాట్లాడి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. తమిళనాడు ప్రభుత్వం నుంచి వీలైనంత సహాయాన్ని అందించగలమని హామీ ఇచ్చారు. ఈ క్రమంలోనే ఇద్దరు ఐఏఎస్ అధికారులను వయనాడ్ వెళ్లాల్సిందిగా సీఎం ఆదేశించినట్టు సీఎంఓ కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. 20 మంది అగ్నిమాపక సిబ్బంది, 20 మందితో కూడిన ఎస్‌డీఆర్ఎఫ్ టీమ్, పది మంది డాక్టర్లు, నర్సులు, సపోర్ట్ స్టాఫ్‌ను తక్షణమే కేరళ వెళ్లాల్సిందింగా సీఎం ఆదేశించినట్టు తెలిపింది.

Read More National News and Latest Telugu News

Updated Date - Jul 30 , 2024 | 03:44 PM

Advertising
Advertising
<