SAVE ABDUL RAHIM: రహీమ్ కోసం రంగంలోకి సీఎం
ABN, Publish Date - Apr 13 , 2024 | 05:30 PM
కేరళకు చెందిన అబ్దుల్ రహీమ్ కోసం.. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయ్ రవి రంగంలోకి దిగారు. అతడిని మరణ శిక్ష నుంచి రక్షించేందుకు సాక్షాత్తు సీఎం నడుం బిగించారు. ఆ క్రమంలో అతడిని రక్షించేందుకు నేను సైతం అంటూ ప్రపంచంలోని మలయాళీలంతా కదిలి రావాలని ఆయన పిలుపు నిచ్చారు.
తిరువనంతపురం, ఏప్రిల్ 13: కేరళకు చెందిన అబ్దుల్ రహీమ్ కోసం.. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయ్ విజయన్ రంగంలోకి దిగారు. అతడిని మరణ శిక్ష నుంచి రక్షించేందుకు సాక్షాత్తు సీఎం నడుం బిగించారు. ఆ క్రమంలో అతడిని రక్షించేందుకు నేను సైతం అంటూ ప్రపంచంలోని మలయాళీలంతా కదిలి రావాలని ఆయన పిలుపు నిచ్చారు. ఇంతకీ అబ్దుల్ రహీమ్ ఎవరు? అతడికి ఎందుకు మరణ శిక్ష పడింది? ఓ రాష్ట్ర ముఖ్యమంత్రి అతడి కోసం.. ఎందుకు ఇంతలా స్పందిస్తున్నారు. అంటే మాత్రం వివరాల్లోకి వెళ్లాల్సిందే.
కేరళలోని కుజికొడ్ నివాసి అబ్దుల్ రహీమ్. అతడు సౌదీ అరేబియాలో నివసిస్తున్నాడు. కారు డ్రైవర్‌గానే విధులు నిర్వహిస్తూనే.. 15 ఏళ్ల దివ్యాంగుడికి కేర్ కేటర్‌గా ఉంటున్నారు. అయితే ఓ రోజు ఆ దివ్యాంగుడిని కారులో తీసుకు వెళ్తున్నాడు. రహదారిపై రెడ్ సిగ్నల్ పడడంతో.. కారు ఆపాడు. సిగ్నల్‌ను అతిక్రమించమని ఆ దివ్యాంగుడు కోరాడు. అందుకు అగ్రహించి ఆ బాబుపై చెయ్యి చేసుకోన్నాడు. ఇంతలో అతడి ప్రాణా వాయువును అందించే పైప్ ఉడిపోయింది. దాంతో అతడు అక్కడికక్కడే మృతి చెందాడని అబ్దుల్ రహీమ్ పోలీసులకు చెప్పినట్లు సమాచారం.
సమోసాలో చచ్చిన చీమలు.. వీడియో వైరల్
దీంతో సౌదీ చట్టం ప్రకారం 2018లో అబ్దుల్ రహీమ్‌కు న్యాయ స్థానం మరణశిక్ష విధించింది. అయితే అతడి మరణ శిక్షపై ఆ దివ్యాంగుడి కుటుంబం తీవ్ర మొండి వైఖరితో ఉంది. చివరకు రూ. 15 మిలియన్ సౌదీ రియాల్స్ ( భారతీయ కరెన్సీ ప్రకారం రూ. 34 కోట్లు) చెల్లిస్తే క్షమాపణలు చెప్పేందుకు ఆ కుటుంబం అంగీకరించింది. ఆ క్రమంలో అబ్దుల్ రహీమ్‌ను రక్షించేందుకు.. లీగల్ కమిటీని ఏర్పాటు చేశారు.
S Jaishankar: ఉగ్రవాదులకు వాళ్ల భాషలోనే సమాధానం ఇవ్వాలి: జైశంకర్
అందులోభాగంగా సేవ్ అబ్దుల్ రహీమ్ పేరిట ఓ యాప్‌ను సృష్టించారు. దీని ద్వారా ఇప్పటికి రూ. 30 కోట్లకు పైగా నగదు సేకరించారు. మరోవైపు సోషల్ మీడియాలో సైతం ప్రచారాన్ని ఉదృతం చేశారు. దీంతో మరణం అంచునున్న అబ్దుల్ రహీమ్‌ను రక్షించనున్నారు. అయితే ఏప్రిల్ 15 లోపు ఆ నగదు మొత్తం చెల్లించాల్సి ఉంది. అందుకు సమయం సమీపిస్తుంది. దాంతో అబ్దుల్ రహీమ్‌ను రక్షించేందుకు లీగల్ కమిటీ రియాద్‌లోని భారత రాయబార కార్యాలయాన్ని సంప్రదిస్తుంది.
జాతీయ వార్తలు కోసం..
Updated Date - Apr 13 , 2024 | 05:36 PM