ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

40 సంవత్సరాల నమ్మకం నిలుపుకుంటూ రమణీయమైన వివాహ వేడుకలు మీ ఇంట వెలిగేలా చేస్తున్న కాకతీయ మ్యారేజస్ తో మీ పేరు ఈరోజే నమోదు చేసుకోండి! ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Kerala: ఆ కేసులో నిందుతులకు 90ఏళ్ల జైలుశిక్ష.. కోర్టు సంచలన తీర్పు..

ABN, Publish Date - Jan 31 , 2024 | 10:31 AM

కేరళలోని దేవికులం ఫాస్ట్ ట్రాక్ స్పెషల్ కోర్టు కీలక తీర్పు వెల్లడించింది. 14 ఏళ్ల బాలికపై అత్యాచారం కేసులో ముగ్గురికి 90 ఏళ్ల జైలుశిక్ష పడింది. v

కేరళలోని దేవికులం ఫాస్ట్ ట్రాక్ స్పెషల్ కోర్టు కీలక తీర్పు వెల్లడించింది. 14 ఏళ్ల బాలికపై అత్యాచారం కేసులో ముగ్గురికి 90 ఏళ్ల జైలుశిక్ష పడింది. నిందితులను పూప్పరకు చెందిన సుగంధ్, శివకుమార్, శామ్యూల్​గా గుర్తించారు. పూప్పరలో 14 ఏళ్ల బాలిక తన స్నేహితుడితో కలిసి టీ తోటకు వెళ్లింది. ఆ సమయంలో అదే ప్రాంతానికి చెందిన ఆరుగురు యువకులు మైనర్ పై అత్యాచారానికి పాల్పడ్డారు. ఆమెతో ఉన్న బాలిక స్నేహితుడిపై దాడి చేయడంతో అతనికి తీవ్ర గాయాలయ్యాయి. 2022లో ఈ ఘటన జరగగా కేసు నమోదైంది.

అత్యాచార కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఆరుగురినీ అదుపులోకి తీసుకుని దేవికులం స్పెషల్ ఫాస్ట్​ట్రాక్ పోక్సో కోర్టులో హాజరు పరిచారు. నిందితులను విచారించిన కోర్టు 90 ఏళ్ల జైలు శిక్షతోపాటు ఒక్కొక్కరికి రూ.40 వేల జరిమానా విధించింది. నగదు మొత్తాన్ని బాలికకు అందజేయాలని కోర్టు ఆదేశించింది. జరిమానా చెల్లించకపోతే మరో ఎనిమిది నెలలు జైలుశిక్ష అనుభవించాలని తీర్పులో వెల్లడించింది.

ఈ కేసులో ఆరుగురు నిందితుల్లో ఒకరిపై సరైన సాక్ష్యాధారాలు లేకపోవడం వల్ల నిర్దోషిగా విడుదల చేసింది. మరో ఇద్దరు మైనర్ నిందితులు తోడుపుజ జువైనల్ కోర్టులో ఉన్నారు.

"మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి."

Updated Date - Jan 31 , 2024 | 10:31 AM

Advertising
Advertising