ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Uttar Pradesh: అఖిలేష్‌కు కౌంటర్ ఇచ్చిన కేశవ్ ప్రసాద్ మౌర్య

ABN, Publish Date - Jul 17 , 2024 | 09:02 PM

ఉత్తరప్రదేశ్‌లోని 10 అసెంబ్లీ స్థానాలకు త్వరలో ఉప ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో రాజకీయం వేడెక్కింది. ఆ క్రమంలో అధికార బీజేపీ, ప్రతిపక్ష సమాజవాదీ పార్టీ (ఎస్పీ)ల మధ్య మాటల యుద్దం వాడి వేడిగా సాగుతుంది.

Keshav Maurya, Akhilesh Yadav

లఖ్‌నవూ, జులై 17: ఉత్తరప్రదేశ్‌లోని 10 అసెంబ్లీ స్థానాలకు త్వరలో ఉప ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో రాజకీయం వేడెక్కింది. ఆ క్రమంలో అధికార బీజేపీ, ప్రతిపక్ష సమాజవాదీ పార్టీ (ఎస్పీ)ల మధ్య మాటల యుద్దం వాడి వేడిగా సాగుతుంది. అధికార బీజేపీలో అంతర్గత కుమ్ములాటలతో సతమవుతుందంటూ ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ ఆరోపించారు. అందుకు ప్రతిగా డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్య ఘాటుగా స్పందించారు. కేంద్రంలో.. రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం బలంగా ఉందని స్పష్టం చేశారు. అయితే రాష్ట్రంలో సమాజ్‌వాదీ పార్టీ మళ్లీ అధికారంలోకి రావడం మాత్రం అసాధ్యమని ఆయన జోస్యం చెప్పారు.

Also Read:AP Assembly: స్పీకర్ అయ్యన్నపాత్రుడు ఆదేశాలతో..

Also Read:Ambati Rambabu: పేరు మారినా ముద్రగడ.. ముద్రగడే


అంతకు ముందు ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ మాట్లాడుతూ.. ఉత్తరప్రదేశ్‌‌ బీజేపీలో ముఖ్యమంత్రి పీఠం కోసం యోగి, మౌర్య మధ్య పెద్ద యద్దమే జరుగుతుందన్నారు. దీంతో రాష్ట్రంలో అస్థిర ప్రభుత్వముందని తెలిపారు. బీజేపీ నేతల పోరుతో రాష్ట్రంలో అభివృద్ధి అనేది లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని ఉపాధ్యాయులను సైతం ఈ ప్రభుత్వం వేధింపులకు గురి చేస్తుందని ఆరోపించారు. రాజధాని లక్నోలో ఇళ్ల కూల్చివేతను యోగి ప్రభుత్వం వాయిదా వేసిందని గుర్తు చేశారు. రాష్ట్రంలోని బీజేపీ ప్రభుత్వం బలహీన పడిందనేందుకు ఇది బలమైన ఉదాహరణ అని అఖిలేష్ యాదవ్ స్పష్టం చేశారు. అంతేకాదు బీజేపీ ఎమ్మెల్యేలు సైతం తమ సొంత అభిప్రాయాలను బాహటంగానే ప్రకటిస్తున్నాని పేర్కొన్నారు.

Also Read:Madhya Pradesh: పాపం.. న్యాయం కోసం రైతు పొర్లు దండాలు

Also Read: Bengaluru: రైతును అవమానించిన మాల్ సిబ్బంది

Also Read: Aadhaar number:‘ఆధార్ నెంబర్‌’ తో బ్యాంక్ ఖాతాలో సొమ్ము మాయం


అయితే తాజాగా బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డాతో యూపీ డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్య భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పార్టీపై అఖిలేష్ యాదవ్ చేసిన కామెంట్స్ చర్చకు వచ్చినట్లు తెలుస్తుంది. ఆ క్రమంలో ఎన్నికల వేళ చాలా జాగ్రత్తగా ఉండాలని మౌర్యకు జేపీ నడ్డా హితవు పలికినట్లు సమాచారం. ఇక 2017 నాటి ఎన్నికల ఫలితాలు 2027లో పునారావృతమవుతాయంటూ కేశవ్ ప్రసాద్ మౌర్య ప్రకటించిన సంగతి తెలిసిందే.

Also Read: Uttar Pradesh: ఉప ఎన్నికల వేళ.. అగ్రనేతలు కీలక భేటీలు

Also Read: Maharashtra: అసెంబ్లీ ఎన్నికల వేళ.. అజిత్‌కి పెద్ద దెబ్బ


ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఎన్డీయే భాగస్వామ్య పక్షాలు 36 సీట్లను మాత్రమే గెలుచుకుంది. ఇండియా కూటమి 43 స్థానాల్లోవిజయం సాధించింది. 2019 ఎన్నికల్లో ఎన్డీయే కూటమి 64 స్థానాల్లో విజయం సాధించిన సంగతి తెలిసిందే. అయితే బీజేపీ నేతల అతి ఆత్మవిశ్వాసమే ఈ ఫలితాలకు కారణమే ఇటీవల సీఎం యోగి వ్యాఖ్యలు చేయడం గమనార్హం.

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Jul 17 , 2024 | 09:02 PM

Advertising
Advertising
<