Share News

ఢిల్లీ పేలుడు వెనక ఖలిస్థానీ మద్దతుదారుల హస్తం

ABN , Publish Date - Oct 22 , 2024 | 05:14 AM

ఢిల్లీలోని సీఆర్పీఎఫ్‌ స్కూల్‌ వద్ద పేలుడుకు పాల్పడింది తామేనంటూ ఖలిస్థానీ మద్దతుదారుల గ్రూప్‌ ప్రకటించింది.

ఢిల్లీ పేలుడు వెనక ఖలిస్థానీ మద్దతుదారుల హస్తం

  • అధికారులను హెచ్చరిస్తూ టెలిగ్రామ్‌ చానెల్‌లో పోస్టు

న్యూఢిల్లీ, అక్టోబరు 21: ఢిల్లీలోని సీఆర్పీఎఫ్‌ స్కూల్‌ వద్ద పేలుడుకు పాల్పడింది తామేనంటూ ఖలిస్థానీ మద్దతుదారుల గ్రూప్‌ ప్రకటించింది. సామాజిక మాధ్యమం టెలిగ్రామ్‌ వేదికగా ఈ ప్రకటన చేసింది. దీనికి సంబంధించిన సందేశాలు పలు గ్రూప్‌ల్లోనూ ప్రత్యక్షమయ్యాయి. దీంతో అప్రమత్తమైన ఢిల్లీ పోలీసులు.. ముందు పోస్టు చేసిన టెలిగ్రామ్‌ చానెల్‌తో పాటు ఏయే గ్రూప్‌ల్లో షేర్‌ చేశారో పూర్తి వివరాలివ్వాలంటూ ఆ సంస్థను కోరారు. ఆదివారం ఉదయం ప్రశాంత్‌విహార్‌లోని స్కూల్‌ వద్ద భారీ శబ్ధంతో పేలుడు సంభవించగా.. ప్రహరీ కూలడంతో పాటు చుట్టుపక్కల భవనాలు, వాహనాల అద్దాలు ధ్వంసమైన సంగతి తెలిసిందే.. అయితే టెలిగ్రామ్‌లో ‘జస్టిస్‌ లీగ్‌ ఇండియా’ అనే చానెల్‌ దీనికి బాధ్యత వహిస్తూ పోస్టు చేసింది. ఖలిస్థాన్‌ జిందాబాద్‌ అని వాటర్‌ మార్క్‌ ఉన్న పేలుడు వీడియోను షేర్‌ చేసింది.

ABN ఛానల్ ఫాలో అవ్వండి

Updated Date - Oct 22 , 2024 | 05:14 AM

News Hub