ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Chennai: బీజేపీ రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా ఖుష్బూ?

ABN, Publish Date - Aug 17 , 2024 | 12:09 PM

బీజేపీ రాష్ట్ర కార్యాచరణ అధ్యక్షురాలిగా ఆ పార్టీ జాతీయ కమిటీ సభ్యురాలు, ప్రముఖ సినీ నటి ఖుష్బూ(Actress Khushboo) నియమితులయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. దీనిపై ఇప్పటికే తమపార్టీ అధిష్టానం తగిన నిర్ణయం తీసుకుందని, త్వరలోనే ప్రకటన వస్తుందని బీజేపీ వర్గాలు పేర్కొన్నాయి.

చెన్నై: బీజేపీ రాష్ట్ర కార్యాచరణ అధ్యక్షురాలిగా ఆ పార్టీ జాతీయ కమిటీ సభ్యురాలు, ప్రముఖ సినీ నటి ఖుష్బూ(Actress Khushboo) నియమితులయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. దీనిపై ఇప్పటికే తమపార్టీ అధిష్టానం తగిన నిర్ణయం తీసుకుందని, త్వరలోనే ప్రకటన వస్తుందని బీజేపీ వర్గాలు పేర్కొన్నాయి. ప్రస్తుతం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న అన్నామలై(Annamalai) ఆక్స్‌ఫర్డ్‌ విశ్వవిద్యాలయంలో అంతర్జాతీయ రాజకీయ శాస్త్రాన్ని అభ్యసించేందుకు వచ్చే నెల లండన్‌ వెళ్తున్నారు. ఆరునెలలపాటు ఆయన లండన్‌లోనే వుంటారు.

ఇదికూడా చదవండి: MUDA Scam: ముడా స్కాం చిక్కుల్లో సీఎం.. ప్రాసిక్యూషన్‌కు గవర్నర్ అనుమతి


ఈ విషయమై అన్నామలై మాట్లాడుతూ.. తాను లండన్‌ వెళ్ళినా రాష్ట్ర అధ్యక్షపదవిలోనే కొనసాగుతానని, తన స్థానంలో కొత్తవారిని పార్టీ అధిష్టానం నియమించే ఆస్కారమే లేదని స్పష్టం చేశారు. అయితే ఆరు నెలలపాటు రాష్ట్రానికి దూరంగా ఉన్నా నాయకులతో తరచూ వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహిస్తూ పార్టీ కార్యాకలాపాలను కొనసాగిస్తానని ఆయన ప్రకటించారు. కానీ ఆయన్ని అధ్యక్ష పదవి నుంచి తొలగించాలంటూ పలువురు సీనియర్లు అధిష్టానాన్ని ఆశ్రయించారు. ఆ మేరకు తెలంగాణా మాజీ గవర్నర్‌ డాక్టర్‌ తమిళిసై సౌందరరాజన్‌, పార్టీ జాతీయ మహిళా కమిటీ కార్యదర్శి వానతి శ్రీనివాసన్‌(Vanathi Srinivasan), శాసనసభ్యుడు నయినార్‌ నాగేంద్రన్‌లో ఎవరో ఒకరిని ఈ పదవి వరించనుందని విస్త్రత ప్రచారం జరుగుతోంది.


అయితే అలాంటిదేమీ లేదని ఢిల్లీ వర్గాలు స్పష్టతనిచ్చాయి. అన్నామలై గైర్హాజరీలో కార్యకలాపాలు నిరాటంకంగా సాగేందుకు బీజేపీ అధిష్టానం ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషించింది. అన్ని వర్గాలను కలుపుకుపోయే వ్యక్తిని వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా నియమించాలని బీజేపీ జాతీయ కమిటీ నిర్ణయించినట్లు తెలిసింది. ఆ మేరకు ఖుష్బూను ఎన్నుకుందని తెలుస్తోంది. రాష్ట్రంలో జరుగనున్న స్థానిక సంస్థల, సహకార సంఘాల ఎన్నికల వ్యూహరచన రూపొందించే బాధ్యతను, సభ్యత్వ ముమ్మర కార్యక్రమాల నిర్వహణ కూడా కార్యాచరణ అధ్యక్షురాలికే అప్పగించాలని అధిష్టానం నిర్ణయించినట్లు సమాచారం.


ర్యాలీకి అనుమతి నిరాకరణ: ఖుష్బూ ఆగ్రహం..

పశ్చిమబెంగాల్‌లోని కొల్‌కతా ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్యురాలిపై జరిగిన సామూహిక అత్యాచారాన్ని ఖండిస్తూ శుక్రవారం సాయంత్రం కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించడానికి పోలీసులు అనుమతి నిరాకరించడం పట్ల బీజేపీ అధికార ప్రతినిధి సీఆర్‌ కేశవన్‌, నటి ఖుష్బూ ఆగ్రహం వ్యక్తం చేశారు. టి.నగర్‌లోని పార్టీ ప్రధాన కార్యాలయం కమలాలయంలో మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. వైద్యురాలిపై జరిగిన ఈ హత్యాచారాన్ని డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్‌, ప్రతిపక్షనేత రాహుల్‌గాంధీ, అఖిలేష్‌ యాదవ్‌ తదితర ఇండియా కూటమి నేతలెవరూ ఖండించకపోవడం గర్హనీయమని ఆరోపించారు. వైద్యురాలికి నివాళులర్పించేలా బీజేపీ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా జిల్లా కేంద్రాల్లో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించేందుకు రాష్ట్ర పోలీసులు అనుమతి నిరాకరించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని ఖుష్బూ అన్నారు.


ఇదికూడా చదవండి: Cyber ​​criminals: నగరంలో.. ఆగని సైబర్‌ మోసాలు..

ఇదికూడా చదవండి: Hyderabad: బెంగళూరు టు బాయ్స్‌ హాస్టల్‌..

ఇదికూడా చదవండి: Hyderabad: కారుతో ఢీకొట్టి.. కళ్లల్లో కారం చల్లి...

Read Latest Telangana News and National News

Updated Date - Aug 17 , 2024 | 12:09 PM

Advertising
Advertising
<